స్పాటిఫైలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సింగర్ ఇతడే.. ఇంటర్నేషనల్ స్టార్లనే వెనక్కి నెట్టేసిన బాలీవుడ్ స్టార్-arijit singh most followed singer on spotify beating taylor swift ed sheeran ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  స్పాటిఫైలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సింగర్ ఇతడే.. ఇంటర్నేషనల్ స్టార్లనే వెనక్కి నెట్టేసిన బాలీవుడ్ స్టార్

స్పాటిఫైలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సింగర్ ఇతడే.. ఇంటర్నేషనల్ స్టార్లనే వెనక్కి నెట్టేసిన బాలీవుడ్ స్టార్

Hari Prasad S HT Telugu

ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో ఓ ఇండియన్ టాప్ సింగర్ ఇంటర్నేషనల్ స్టార్లను మించిపోయాడు. టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరన్ లాంటి వాళ్లను కూడా వెనక్కి నెట్టడం విశేషం. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసా?

స్పాటిఫైలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సింగర్ ఇతడే.. ఇంటర్నేషనల్ స్టార్లనే వెనక్కి నెట్టేసిన బాలీవుడ్ స్టార్ (PTI)

ఎప్పుడో 13 ఏళ్ల కిందట వచ్చిన ఆశిఖీ 2 మూవీలోని "తుమ్ హి హో" పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు అరిజిత్ సింగ్. ఇప్పుడు అతడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో 151 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో, గ్లోబల్ పాప్ స్టార్లు టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరన్‌లను అధిగమించి, అత్యధిక మంది ఫాలోవర్స్‌ను కలిగిన ఆర్టిస్ట్ గా నిలిచాడు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘనత అని చెప్పాలి.

అరిజిత్ సింగ్ ఇలా..

ఈ మ్యూాజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ను ఫాలో అయ్యే డేటా ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు Chartmasters, Volt.fm ఈ వారం విడుదల చేసిన జాబితా ఇలా ఉంది. పాప్ మ్యూజిక్ రంగంలో అతిపెద్ద పేర్లలో ఒకరైన అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ 139.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో రెండవ స్థానంలో ఉంది. ఇటీవల తన ఇండియా-నేపథ్య ట్రాక్ "సఫైర్"తో వచ్చిన బ్రిటన్ గాయకుడు ఎడ్ షీరన్ 121 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. అరిజీత్ సింగ్ మాత్రం ఈ ఇద్దరికీ అందనంత ఎత్తులో ఏకంగా 15 కోట్లకుపైగా ఫాలోవర్లతో ఉండటం విశేషం.

ఈ వెబ్‌సైట్‌లు ఆర్టిస్టుల కమర్షియల్ సక్సెస్, స్ట్రీమింగ్ డేటా, స్పాటిఫైలో వారి మొత్తం ప్రజాదరణపై లోతైన విశ్లేషణను అందిస్తాయి. జాబితాలో 114 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో బిల్లీ ఐలిష్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ది వీకెండ్ (అసలు పేరు అబెల్ టెస్ఫాయే) 107.3 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ఐదవ స్థానంలో నిలిచారు. టాప్ 10లో అరియానా గ్రాండే, ఎమినెమ్, డ్రేక్, బాడ్ బన్నీ, జస్టిన్ బీబర్ కూడా ఉన్నారు.

ఈ జాబితాలోని ఇతర భారతీయ కళాకారులలో ఎ.ఆర్. రెహమాన్, ప్రీతమ్, నేహా కక్కర్ ఉన్నారు. దివంగత సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ వరుసగా 22 మిలియన్లు, 16 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో 100వ, 144వ స్థానాల్లో ఉన్నారు.

మంత్లీ యూజర్ల డేటా వేరుగా..

అయితే, నెలవారీ శ్రోతల (మంత్లీ లిజినర్స్) సంఖ్య మాత్రం వేరే విధంగా చూపిస్తోంది. స్పాటిఫై తన మ్యూజిషియన్ల ఫాలోవర్ల గురించి డేటాను విడుదల చేయనప్పటికీ, ప్లాట్‌ఫామ్‌లో ప్రతి ఆర్టిస్ట్ శ్రోతల సంఖ్యను చూపిస్తుంది.

అరిజిత్ సింగ్ నెలవారీ శ్రోతల సంఖ్య 47.4 మిలియన్లు కాగా, టేలర్ స్విఫ్ట్ శ్రోతలు 82.3 మిలియన్లుగా ఉన్నారు. షీరన్ 98.4 మిలియన్లు, ఐలిష్ 95.1 మిలియన్ల నెలవారీ శ్రోతలను కలిగి ఉన్నారు. ది వీకెండ్ 112.2 మిలియన్ల శ్రోతలను కలిగి ఉన్నారు.

అరిజిత్ సింగ్ ప్రస్థానం ఇలా..

ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అరిజిత్ సింగ్ ఎదుగుదల అసాధారణమైనది. 38 ఏళ్ల అరిజిత్ 2005లో 'ఫేమ్ గురుకుల్' రియాలిటీ షోలో ఒక పోటీదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే, 2013లో "ఆశిఖీ 2" సినిమా నుంచి వచ్చిన హృదయానికి హత్తుకునే హిట్ పాట “తుమ్ హి హో”తో అతడు నిజమైన స్టార్‌డమ్‌ను అందుకున్నాడు.

ఈ పాట విజయం అతన్ని దేశవ్యాప్తంగా ఇంటింటికీ తెలిసిన పేరుగా మార్చింది. ఆ తర్వాత నుంచి అరిజిత్.. ప్రేమ, విరహానికి సంబంధించిన పాటలను ఎక్కువగా పాడాడు. "ఛన్నా మేరేయా", "రాబ్తా", "కేసరియా", "ఫిర్ లే ఆయా దిల్", "ఏ దిల్ హై ముష్కిల్" వంటి అనేక చార్ట్‌బస్టర్‌లను అందించాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.