Arijit Singh India Tour: హైదరాబాద్‌లో బాలీవుడ్ నంబర్ వన్ సింగర్ కాన్సర్ట్.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి-arijit singh india tour bollywood singer hyderabad concert date time tickets booking details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Arijit Singh India Tour: హైదరాబాద్‌లో బాలీవుడ్ నంబర్ వన్ సింగర్ కాన్సర్ట్.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి

Arijit Singh India Tour: హైదరాబాద్‌లో బాలీవుడ్ నంబర్ వన్ సింగర్ కాన్సర్ట్.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి

Hari Prasad S HT Telugu
Nov 05, 2024 03:03 PM IST

Arijit Singh India Tour: బాలీవుడ్ నంబర్ వన్ సింగర్, మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ లోనూ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. మరి ఈ కాన్సర్ట్ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలన్న వివరాలు ఇక్కడ చూడండి.

హైదరాబాద్‌లో బాలీవుడ్ నంబర్ వన్ సింగర్ కాన్సర్ట్.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి
హైదరాబాద్‌లో బాలీవుడ్ నంబర్ వన్ సింగర్ కాన్సర్ట్.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి

Arijit Singh India Tour: బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ పాటలంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యంగా మెలోడీస్ ఇష్టపడే వారికి అతడు ఫేవరెట్ సింగర్. తన వాయిస్ తో మెస్మరైజ్ చేసే ఈ టాప్ సింగర్.. ఇండియా టూర్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఐదు నగరాల్లో కాన్సర్ట్స్ ఉండగా.. హైదరాబాద్ లోనూ డిసెంబర్ 7న ఏర్పాటు చేశారు.

అరిజిత్ సింగ్ హైదరాబాద్ కాన్సర్ట్

అరిజిత్ సింగ్ బాలీవుడ్ లో నంబర్ వన్ సింగర్. అతని పాటలను లైవ్ లో వినాలని కోరుకునే హైదరాబాద్ లోని అభిమానులకు గుడ్ న్యూస్. అరిజిత్ మరోసారి నగరానికి వస్తున్నాడు. ఇండియాలోని ఐదు నగరాల టూర్ లో భాగంగా డిసెంబర్ 7న హైదరాబాద్ లో అరిజిత్ సింగ్ కాన్సర్ట్ ఉండనుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న మామిడిపల్లిలోని జీఎంఆర్ ఎరెనాలో ఈ కాన్సర్ట్ జరగబోతోంది. డిసెంబర్ 7న సాయంత్రం 5 గంటల నుంచి ఐదు గంటల పాట అరిజిత్ తన మెస్మరైజింగ్ వాయిస్ తో అలరించనున్నాడు. ఈ కాన్సర్ట్ కోసం నగరంలోని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

టికెట్ల బుకింగ్ ఇలా..

అరిజిత్ సింగ్ కాన్సర్ట్ కోసం ఇప్పటికే టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. వీటిని https://insider.in/ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధర రూ.5 వేల నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ఎరెనాను నాలుగు భాగాలుగా విభజించారు. అందులో అతి తక్కువగా సిల్వర్ జోన్ లోని టికెట్లు రూ.5 వేల నుంచి ప్రారంభమైంది. ఇది స్టేజ్ కు చాలా దూరంగా ఉంటుంది.

ఆ తర్వాత గోల్డ్ ఫ్యాన్ జోన్ లో నుంచి కాన్సర్ట్ చూడాలంటే టికెట్ ధర రూ.6500గా ఉంది. ఇక ప్లాటినం జోన్ లో టికెట్ రూ.12500 కాగా.. అత్యధికంగా డైమండ్ ఎక్స్‌పీరియన్స్ జోన్ టికెట్ ధర అత్యధికంగా రూ.50 వేలుగా ఉంది. డిసెంబర్ 7న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కాన్సర్ట్ జరగనుంది.

అరిజిత్ సింగ్ ఇండియా టూర్

అరిజిత్ సింగ్ ఇండియా టూర్ నవంబర్ 30న ప్రారంభం కానుంది. మొత్తంగా ఐదు ప్రధాన నగరాల్లో ఈ కాన్సర్ట్ జరగబోతోంది. తొలి రోజు అంటే నవంబర్ 30న బెంగళూరులో ఈ టూర్ మొదలవుతుంది.

ఆ తర్వాత డిసెంబర్ 7న హైదరాబాద్ లో, ఫిబ్రవరి 2న ఢిల్లీలో, మార్చి 23న ముంబైలో, ఏప్రిల్ 27న చెన్నైలో అరిజిత్ సింగ్ కాన్సర్ట్స్ జరగనున్నాయి. బాలీవుడ్ లో దశాబ్ద కాలానికిపైగా తన పాటలతో అలరించిన అరిజిత్ సింగ్ ను లైవ్ లో వినడానికి, చూడటానికి అభిమానులు ఎగబడటం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner