తెలుగులో లేటెస్ట్‌గా వస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా అరి. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవై హార్ష, సురభి ప్రభావతి, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమానే అరి.
అరి మూవీకి పేపర్ బాయ్ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వం వహించారు. మొన్నటివరకు ప్రమోషన్స్ సైలెంట్‌గా చేసిన అరి సినిమాకు ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. అందుకు కారణం రీసెంట్‌గా రిలీజ్ అయిన అరి మూవీ ట్రైలర్. గూస్ బంప్స్ ఇచ్చే విజువల్స్, బీజీఎమ్‌తో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది అరి ట్రైలర్.
సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ అరి సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. భూమి మీదకు శ్రీ కృష్ణుడు రావాలనుకున్నప్పుడు ఆయనతోపాటు ఆరుగురు దేవతలు కూడా వస్తాననడం, ఆ ఆరుగురు దేవతలు మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం వంటి అంతర్గత శత్రువుల్లా కలిసిపోతాయి.
కట్ చేస్తే భూలోకంలో "ఇక్కడ కోరికలు తీర్చబడును" అంటూ ఒక వ్యక్తి లైబ్రరీలో కూర్చోవడం, అతని దగ్గరికి కొంతమంది వచ్చి వారి కోరికలు చెప్పడం, అవి నెరవేరేందుకు వారు ఓ పని చేయాలని ఆ వక్తి చెప్పడం వంటివి అన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించే విజువల్స్, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.
అలాగే, లైబ్రరీలో ఉన్న వ్యక్తితో కోరికలు తీర్చుకునేందుకు వచ్చిన పాత్రలు మాట్లాడే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక క్లైమాక్స్‌లో శ్రీకృష్ణుడి ఎంట్రీ హనుమాన్, మిరాయ్ సినిమాలను గుర్తు చేస్తుంది. హనుమాన్ ట్రైలర్‌లో ఆంజనేయుల వారు, మిరాయ్ ట్రైలర్‌లో శ్రీరాముడు చివరిలో కనిపించి ఎలాంటి హై ఇచ్చారో అదే తరహాలో అరి సినిమాలో శ్రీకృష్ణుడు కనిపించిన తీరు అదిరిపోయింది.
అయితే, ప్రస్తుతం సినిమాల్లో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడి కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను యాడ్ చేస్తున్నారు.
క్లైమాక్స్‌లో గూస్‌బంప్స్ ఎలిమెంట్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు. అలా క్లైమాక్స్ బలంగా వర్కౌట్ కాబట్టే ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వండర్లు క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇదే తరహాలో అరి సినిమా రానుందని తెలుస్తోంది.
అరి ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు హైలెట్ అవనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మిరాయ్, హనుమాన్, కాంతార తరహాలో వచ్చిన అరి సినిమా అక్టోబర్ 10న విడుదలై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం