Aravind Swami look in Custody: కస్టడీ మూవీ నుంచి అదిరే అప్డేట్.. అరవింద్ స్వామి లుక్ విడుదల-aravind swami look released in custody movie
Telugu News  /  Entertainment  /  Aravind Swami Look Released In Custody Movie
కస్టడీ మూవీలో అరవింద్ స్వామి లుక్
కస్టడీ మూవీలో అరవింద్ స్వామి లుక్

Aravind Swami look in Custody: కస్టడీ మూవీ నుంచి అదిరే అప్డేట్.. అరవింద్ స్వామి లుక్ విడుదల

02 March 2023, 21:55 ISTMaragani Govardhan
02 March 2023, 21:55 IST

Aravind Swami look in Custody: నాగచైతన్య హీరోగా నటించిన సరికొత్త చిత్రం కస్టడీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. అరవింద్ స్వామి లుక్‌ను విడుదల చేసింది.

Aravind Swami look in Custody: అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న ద్విభాషా చిత్రం కస్టడీ. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజు అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. రెట్రో లుక్‌లో అరవింద్ స్వామి ఆకట్టుకున్నారు. జైల్లో ఖైదీగా ఊసలు వెనక నిల్చుని ఇంటెన్స్ లుక్‌తో చూస్తున్నట్లున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నతంగా ఉన్నట్లు ఈ సినిమా పోస్టర్లు చూస్తూనే తెలుస్తోంది. నాగచైతన్య లుక్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.