Aradhya song Lyrics from Kushi: ఖుషీ మూవీ ఆరాధ్య సాంగ్ లిరిక్స్ ఇవే.. మైమరపిస్తున్న మెలోడీ
Aradhya song Lyrics from Kushi: ఖుషీ మూవీ ఆరాధ్య సాంగ్ లిరిక్స్ ఇవే. మైమరపిస్తున్న ఈ మెలోడీ ఇప్పుడు ఎవరి నోట చూసినా వినిపిస్తోంది. ఈ పాటలో విజయ్, సమంత కెమెస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది.
Aradhya song Lyrics from Kushi: విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషీ మూవీ నుంచి ఈ మధ్యే ఆరాధ్య సాంగ్ రిలీజైన సంగతి తెలుసు కదా. మైమరపించేలా ఉన్న ఈ మెలోడీ లిరిక్స్ కూడా అంతే బాగున్నాయి. ఎంతో లోతుగా, ప్రేమలో మునిగి తేలుతున్న వారికి సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఆ పాట లిరిక్స్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.
సిద్ శ్రీరామ్, చిన్మయి ఈ పాట పాడారు. ఇక ఖుషీ మూవీ డైరెక్టర్ అయిన శివ నిర్వాణనే ఈ పాట రాయడం విశేషం. మ్యూజిక్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించాడు. ఇప్పటికే ఖుషీ నుంచి వచ్చిన తొలి పాట నా రోజా నువ్వే కూడా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ఆరాధ్య కూడా అంతకుమించి ఉందని చెప్పొచ్చు.
ఆరాధ్య పాట లిరిక్స్
యు ఆర్ మై సన్ షైన్
యు ఆర్ మై మూన్ లైట్
యు ఆర్ మై స్టార్ ఇన్ ద స్కై
కమ్ విత్ మి నౌ
యు హావ్ మై డిజైర్
నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా..
పదము నీ వైపిలా..
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తారా
నా గుండెను మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
యే వందల కొద్దీ పండగలున్నా
వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఈ పూట నా పాట
చేరాలి నీ దాక
నీ చిన్ని మెడ వంపులో..
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాక
గెలిచేది ఎవరేమిటో..
ఇలాగే ఉంటాలే
నీతోనే దూరాలు
తీరాలు లేవే
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఏదో అనాలంది
ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో..
నా దాక చేరింది
నా కూడా బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో..
నీలానే మారానే అంటానే
నువ్వంటు నేనంటు లేమే
మనసార చెలి తార
నా గుండెను మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందలకొద్దీ పండగలున్నా
వెన్నుల మొత్తం నిండుగ ఉన్నా..
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
పదము నీ వైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
సంబంధిత కథనం