గౌతమ్ కార్తీక్ హీరోగా 'ఆగస్ట్ 16, 1947'.. ఏప్రిల్ 7న విడుదల-ar murugadoss production august 16 1947 unveils official release date with latest poster
Telugu News  /  Entertainment  /  Ar Murugadoss Production August 16 1947 Unveils Official Release Date With Latest Poster
ఆగస్ట్ 16, 1947 మూవీ పోస్టర్
ఆగస్ట్ 16, 1947 మూవీ పోస్టర్

గౌతమ్ కార్తీక్ హీరోగా 'ఆగస్ట్ 16, 1947'.. ఏప్రిల్ 7న విడుదల

08 March 2023, 14:53 ISTHT Telugu Desk
08 March 2023, 14:53 IST

గౌతమ్ కార్తీక్ హీరోగా రూపొందిన 'ఆగస్ట్ 16, 1947’ మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్ 'ఆగస్ట్ 16, 1947' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్స్, ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ బట్, నర్సీరామ్ చౌదరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. మన దేశ స్వాతంత్య్రం గురించి ఇప్పటి వరకు రాని కోణంలో షాకింగ్ కథతో తెరకెక్కించినట్టు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఏప్రిల్ 7న 'ఆగస్ట్ 16, 1947' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు బుధవారం నిర్మాతలు వెల్లడించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన కాలానికి ప్రేక్షకులను ఈ సినిమా తీసుకు వెళ్తుందని, అద్వితీయ అనుభవాన్ని ఇస్తుందని నిర్మాతలు చెప్పారు.

ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ సరసన రేవతి నటించారు. కథానాయకగా ఆమెకు తొలి చిత్రమిది. లెజెండరీ కమెడియన్ పుగళ్ కీలక పాత్ర పోషించారు. విడుదల తేదీ వెల్లడించడంతో పాటు సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోని ఒక పల్లెటూరిలో జరిగే కథతో రూపొందించిన హిస్టారికల్ సినిమా 'ఆగస్ట్ 16, 1947' అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహ నిర్మాతగా ఉన్నారు.