20 సంవత్సరాల వేడుక- జీ తెలుగు అప్సర అవార్డ్స్- అక్కినేని అమల సమక్షంలో సమంత సినీ ప్రయాణం- ఐశ్వర్య రాజేశ్ తండ్రి ఏఐ చిత్రం-apsara awards 2025 for zee telugu 20 years celebrations samantha akkineni amala aishwarya rajesh rk roja participated ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  20 సంవత్సరాల వేడుక- జీ తెలుగు అప్సర అవార్డ్స్- అక్కినేని అమల సమక్షంలో సమంత సినీ ప్రయాణం- ఐశ్వర్య రాజేశ్ తండ్రి ఏఐ చిత్రం

20 సంవత్సరాల వేడుక- జీ తెలుగు అప్సర అవార్డ్స్- అక్కినేని అమల సమక్షంలో సమంత సినీ ప్రయాణం- ఐశ్వర్య రాజేశ్ తండ్రి ఏఐ చిత్రం

Sanjiv Kumar HT Telugu

జీ తెలుగు 20 సంవత్సరాల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా అప్సర అవార్డ్స్‌ను నిర్వహించింది. బుల్లితెర తారలు, స్టార్ హీరోయిన్లతో సందడిగా సాగిన ఈ వేడుకల్లో ఎన్నో రంగాల్లో రాణిస్తున్న మహిళలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ ఈవెంట్‌లో అక్కినేని అమల సమక్షంలో సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని చూపించారు.

20 సంవత్సరాల వేడుక- జీ తెలుగు అప్సర అవార్డ్స్- అక్కినేని అమల సమక్షంలో సమంత సినీ ప్రయాణం- ఐశ్వర్య రాజేశ్ తండ్రి ఏఐ చిత్రం

ప్రారంభించిన రోజునుంచీ ప్రతిభావంతులైన కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, చిత్రబృందం అచంచలమైన అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ తిరుగులేని ఛానల్‌​గా ఎదిగింది జీ తెలుగు.

జీ తెలుగు అప్సర అవార్డ్స్

మే 18, 2025 నాటికి విజయవంతంగా ఇరవై సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలకు ప్రతిష్ఠాత్మక జీ తెలుగు అప్సర అవార్డులను ప్రదానం చేసింది. వెండితెర, బుల్లితెర తారల సందడితో వైభవంగా జరిగిన జీ తెలుగు అప్సర అవార్డ్స్​ ఈ శనివారం (మే 24) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

అనిల్ రావిపూడితో కలిసి

అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్​ యాంకర్స్​ సుధీర్​, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో డ్రామా జూనియర్స్ పిల్లలు చిరంజీవి, బాలకృష్ణ గెటప్‌లో వేదికపైకి వచ్చి ప్రముఖ నటి రోజాకు అవార్డు అందించారు. జయప్రద, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని సీన్స్‌​ని రీక్రియేట్ చేశారు.

అమల అక్కినేని డ్యాన్స్

రవి, రోజాతో కలిసి అమల అక్కినేని డాన్స్​ చేయడమే కాకుండా, జంతు సంరక్షణ, నాగార్జున, నాగచైతన్య, అఖిల్​ గురించి పలు విషయాలు పంచుకున్నారు. జయసుధకు అభిమానులు ఆటోగ్రాఫ్‌లతో అలంకరించిన చీరను బహుమతిగా ఇచ్చారు. రమ్యకృష్ణ నటించిన ప్రముఖ పాత్రలతో ఓ చక్కని ప్రదర్శన ఇచ్చారు.

మంచు లక్ష్మీతో డ్యాన్స్

మంచు లక్ష్మీ తన డాన్స్‌​తో అలరించగా, కోర్ట్​ సినిమా ఫేమ్​ శ్రీదేవి తన తల్లి గురించి పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. రవి, సుధీర్ కలిసి డైరెక్టర్​ సుకుమార్‌ను పలు సరదా ప్రశ్నలతో ఆటపట్టించారు. హీరోయిన్​ ఐశ్వర్య రాజేష్ తన తండ్రి ఏఐ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణం

స్టార్ హీరోయిన్ సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని అద్భుతమైన ప్రదర్శన, కేక్ కట్టింగ్‌తో ఈ వేదికపై ఘనంగా జరుపుకున్నారు. 114 ఏళ్ల పద్మశ్రీ తిమ్మక్క ఎనభై సంవత్సరాల్లో 8000 చెట్లు నాటినందుకుగానూ ఈ వేదికపై సన్మానించారు. వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న మార్గదర్శి చిట్​‌ఫండ్స్​ ఎండీ శైలజా కిరణ్​ ప్రతిష్టాత్మక మహిళా మార్గదర్శి అవార్డు అందుకున్నారు.

టాలీవుడ్ హీరోయిన్స్

జీ తెలుగు తారలు చేసి నవదుర్గ ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకుంది. మోనికా రెబా, హెబా పటేల్, శ్రీదేవి, రోషన్ నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఘనంగా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్​ ప్రముఖులైన సంయుక్త మీనన్, మీనాక్షి చౌదరి, మురళీ మోహన్, అన్నపూర్ణ, స్వప్న దత్, ప్రియాంక దత్, జీవిత రాజశేఖర్​, శివాని రాజశేఖర్​, సుమ కనకాల, కోన వెంకట్, నిహారిక కొణిదెల, అనసూయ, డైరెక్టర్ నందిని రెడ్డి, రజిత, ప్రగతితో పాటు మరికొందరు నటీనటులు పాల్గొని సందడి చేశారు.

అంగరంగా వైభవంగా

హృదయాలను హత్తుకునే క్షణాలతో ఈ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డాన్స్ ప్రదర్శనలు, అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు ప్రముఖుల భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం