Vyooham RK Roja: పచ్చ సైకోలకు తడిసిపోయింది.. ఆర్జీవీ ఒక సెన్సేషన్.. మంత్రి రోజా కామెంట్స్
RK Roja Speech At Vyooham Pre Release Event: తాజాగా జరిగిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ మినిస్టర్ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. పచ్చ సైకోలకు తడిసిపోయిందంటూ పరోక్షంగా టీడీపీ నేతలపై విమర్శలు సంధించారు.
RK Roja About Vyooham: కాంట్రవర్సీ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో పొలిటికల్ మూవీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

వ్యూహం సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ పోషించాడు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే వ్యూహం ట్రైలర్, టీజర్, పోస్టర్స్ ఏపీలో ఉత్కంఠను రేకెత్తించాయి. ట్రైలర్‌లో టీడీపీ నేతలపై ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు సంధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల సందర్భంగా వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో శనివారం (డిసెంబర్ 23) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఆర్జీవీ అంటేనే ఒక సెన్సేషన్. వ్యూహం సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే, సైకిల్ పార్టీ షేకయిపోయింది. వర్మ గారు డైరెక్టర్ అని తెలియగానే పచ్చ సైకోలకు తడిసిపోయింది. ఎప్పుడైతో వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబుకు చెమటలు పట్టాయి. ట్రైలర్‌తో లోకేష్ పరుగులు పెట్టాడు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు, జగన్ అన్నపడిన సంఘర్షణకు రూపమే వ్యూహం సినిమా అని తెలుస్తుంది" అని మంత్రి రోజా తెలిపారు.
"గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలాగే ఈ వ్యూహం సినిమాతో రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఈ తరంతో పాటు వచ్చే తరానికీ కూడా తెలుస్తాయి" అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.