March OTT Crime Thrillers: మార్చిలో ఓటీటీలోకి వచ్చిన 4 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు.. మిస్ అవొద్దు!
March OTT Crime Thrillers: మార్చి నెలలో నాలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీల్లో అడుగుపెట్టాయి. ఈ పాపులర్ చిత్రాలు వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ మూవీ.. ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఉందంటే..
March OTT Crime Thrillers: క్రైమ్ థిల్లర్ సినిమాలను చాలా మంది ఇష్టపడతారు. ఉత్కంఠభరితంగా, మలుపులతో సాగే ఈ జానర్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఓటీటీల్లో క్రైమ్ థిల్లర్ చిత్రాలకు మరింత ఆదరణ దక్కుతుంది. మార్చి నెలలో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి నాలుగు ముఖ్యమైన క్రైమ్ థిల్లర్ సినిమాలు వచ్చాయి. అవేవో.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.

అన్వేషిప్పిన్ కండేతుమ్
మలయాళ స్టార్ టొవినో థామస్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ థియేటర్లలో బిగ్ హిట్ అయింది. ఫిబ్రవరి 9న మలయాళం రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం మార్చి 8వ తేదీన ‘నెట్‍ఫ్లిక్స్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మర్డర్ మిస్టరీతో రూపొందిన అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి డార్విన్ కురియన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం ఇంకా టాప్-10లో ట్రెండ్ అవుతోంది.
మర్డర్ ముబారక్
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘మర్డర్ ముబారక్’ నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మార్చి 15వ తేదీన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం భాషల్లో 'నెట్‍ఫ్లిక్స్' ఓటీటీలో అడుగుపెట్టింది. ఓ జిమ్ ట్రైనర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.
మర్డర్ ముబారక్ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, సారా అలీ కాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, టిస్కా చోప్రా కీలకపాత్రలు పోషించారు. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సచిన్ - జిగార్ సంగీతం అందించారు.
భూతద్దం భాస్కర్ నారాయణ
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చింది. మార్చి 1వ తేదీన ఈ తెలుగు సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ చిత్రం మోస్తరుగా ఆడింది. ఈ సినిమా మార్చి 22వ తేదీన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రానికి పురుషోత్తమ రాజ్ దర్శకత్వం వహించారు. వరుస హత్య కేసులను మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీలో శివ కందూకూరితోతో పాటు రాశీ సింగ్, దేవీ ప్రసాద్, అరుణ్ కుమార్, శివ కుమార్, వర్షిణి సౌందరరాజన్ కీలకపాత్రలు పోషించారు.
అబ్రహాం ఓజ్లెర్
సుమారు రెండు నెలల నిరీక్షణ తర్వాత అబ్రహాం ఓజ్లెర్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా జనవరి 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో జయరాం ప్రధాన పాత్ర పోషించగా.. మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ఓ కీలకపాత్ర చేశారు. ఈ సినిమా మార్చి 20వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
అబ్రహాం ఓజ్లెర్ చిత్రానికి మిధున్ మాన్యుయెల్ దర్శకత్వం వహించారు. ఇర్షాద్ హసన్, మాన్యుయెల్ థామస్ నిర్మించిన ఈ మూవీకి మిథున్ ముకుందన్ సంగీతం అందించారు.