టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నారా? చాలా కాలం తర్వాత శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారా? అంటే సినీ వర్గాల నుంచి అవుననే మాటే వినిపిస్తోంది. కార్తి హీరోగా రాబోతున్న ఖైది 2 సినిమాలో అనుష్క నటించబోతున్నారనే క్రేజీ బజ్ తెగ వైరల్ గా మారింది. ఈ వార్త తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ఆ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 2019లో వచ్చిన ఖైదీ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో జైల్లో ఉండే ఖైదీ.. రౌడీ గ్యాంగ్ నుంచి పోలీసులను ఎలా తప్పించాడు? పోలీస్ స్టేషన్ ను ఎలా కాపాడాడు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? అనేది ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ 2 తెరకెక్కనుంది. ఈ సినిమాలోనే అనుష్క పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖైదీ 2 సినిమాలో అనుష్క లేడీ డాన్ క్యారెక్టర్ చేయబోతున్నారనే బజ్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఖైదీ 2లో హీరో కు దీటైన క్యారెక్టర్ లో అనుష్క కనిపించబోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం అనుష్కను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సంప్రదించారని తెలిసింది. మరి ఈ సంగతి నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సింది.
చాలా కాలంగా బిగ్ స్క్రీన్ పై కనిపించని అనుష్క ఇప్పుడు ‘ఘాటి’తో ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జులై 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎదురు తిరిగిన బాధితురాలిగా అనుష్క పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిందని తెలిసింది. ఈ ఘాటి సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని స్వీటీ అనుకుంటోంది.
43 ఏళ్ల అనుష్క చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో కనిపించారు. 2023లో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఘాటి సినిమాతో మరోసారి థియేటర్లకు రాబోతున్నారు స్వీటీ. ఇక మలయాళంలో కథనార్ అనే సినిమా కూడా చేస్తున్నారు. యోగా టీచర్ నుంచి హీరోయిన్ గా మారిన అనుష్క 2005లో సూపర్ సినిమాతో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. 2009లో వచ్చిన అరుంధతి సినిమాతో ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు. బాహుబలి సినిమాలతో మరో రేంజ్ కు వెళ్లిపోయారు.
సంబంధిత కథనం