Anushka 48th Movie First Look: చెఫ్ పాత్రలో అనుష్క సర్‌ప్రైజ్ - 48వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
Anushka 48th Movie First Look: చెఫ్ రోల్‌లో అనుష్క అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న 48వ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
Anushka 48th Movie First Look: అనుష్క పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది యూవీ క్రియేషన్స్. అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. న్యూఏజ్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకు మహేష్‌బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో అనుష్క అన్వితరవళి శెట్టి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పేర్కొన్నది. ఈ పోస్టర్‌లో అనుష్క చెఫ్‌గా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది. చెఫ్స్ ధరించే వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో వంటకాల్ని సిద్ధం చేస్తోన్నట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. డ్రెస్‌పై నేమ్ ప్లేట్ ఉండటం ఆసక్తిని పంచుతోంది.
అనుష్క చిరునవ్వులు చిందిస్తోన్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తనకన్న తక్కువ వయస్కుడైన యువకుడితో ప్రేమలో పడే అమ్మాయిగా అనుష్క ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. అనుష్క హీరోయిన్‌గా నటిస్తోన్న 48వ సినిమా ఇది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి అంగీకరించిన సినిమా ఇదే కావడం గమనార్హం.