Anupama Parameswaran: కేరళ ప్రభుత్వంపై కోర్టులో కేసు వేసిన అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran: కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాటం చేయబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ఆమె పోరాటం ఎందుకోసం అంటే....
Anupama Parameswaran: కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది అనుపమ పరమేశ్వరన్. ఫేమస్ లాయర్ అండతో రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నది. అయితే రియల్‌లైఫ్‌లో కాదు రీల్‌లైఫ్‌లో.
మలయాళంలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పేరుతో అనుపమ పరమేశ్వరన్ ఓ సినిమా చేయబోతున్నది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మలయాళ సీనియర్ యాక్టర్ సురేష్ గోపి కీలక పాత్రను పోషిస్తోన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుండగా ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో ఈ సినిమాను షూట్ చేస్తోన్నారు.
కోర్ట్ రూమ్ డ్రామా…
ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలో సురేష్ గోపి తనయుడు మాధవ్ సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే మాధవ్ సురేష్ నటుడిగా అరంగేట్రం చేస్తోన్నట్లు సమాచారం.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలో ఓ తెలుగు నటుడు కీలకపాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. అతడు ఎవరన్నది త్వరలోనే రివీల్ కానున్నట్లు సమాచారం. తెలుగులో కార్తికేయ 2తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది అనుపమ పరమేశ్వరన్. ఈ సక్సెస్ తర్వాత డీజే టిల్లు సీక్వెల్‌తో పాటు రవితేజ ఈగిల్‌లలో హీరోయిన్‌గా నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్.
టాపిక్