Dragon Movie: ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లున్నహీరో లవ్ స్టోరీ - అనుపమ పరమేశ్వరన్ డ్రాగన్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Dragon Movie: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ లవ్ ఎంటర్‌టైనర్ మూవీలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్నాడు. డ్రాగన్ మూవీ తెలుగు ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Dragon Movie: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ డ్రాగన్ తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమా తెలుగులో రిటర్స్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్‌తో విడుదల అవుతోంది. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
48 బ్యాక్‌లాగ్‌లు...
డ్రాగన్ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు ఉన్న యువకుడిగా ప్రదీప్ రంగనాథన్ కనిపిస్తున్నాడు. చదువు సంధ్యలు లేకుండా అందరితో గొడవలు పెట్టుకుంటూ సరదాగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడిగా అతడి క్యారెక్టర్‌ను ట్రైలర్‌లో పరిచయం చేశారు. కాలేజీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? లైఫ్ పార్ట్‌నర్‌గా ప్రేమించిన అమ్మాయే అతడిని ఫెయిల్యూర్ అని ఎందుకు అనాల్సివచ్చిందనే అంశాలను ట్రైలర్‌లో చూపించారు.
యూట్యూబ్‌లో ట్రెండ్...
ఇమ్మిడియేట్ సక్సెస్ కోసం తప్పుడు దారులను ఎంచుకున్న అతడు ఎలా రియలైజ్ అయ్యాడన్నది ట్రైలర్‌లో టచ్ చేశారు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ ట్రైలర్‌లో చూపించారు. బాధత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను ఆవిష్కరిస్తూ ఎంటర్‌టైనింగ్‌గా ఈ ట్రైలర్ సాగింది. ఈ తెలుగు ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇద్దరు హీరోయిన్లు...
రిటర్స్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు కయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. తమిళ డైరెక్టర్లు కె. యస్. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
నలభై కోట్ల బడ్జెట్...
లవ్ టుడే సినిమాతో తమిళంతో పాటు తెలుగులో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అతడు చేస్తోన్న మూవీ ఇది. డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెలుగులో విశ్వక్‌సేన్‌తో ఓరిదేవుడా సినిమా చేశాడు. డ్రాగన్ మూవీకి ప్రదీప్ రంగనాథన్, అశ్వత్ మారిముత్తు ఇద్దరు కలిసి కథను అందించారు. దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
సంబంధిత కథనం