నాకు నటన రాదని ఎగతాళి చేశారు.. వాళ్లకు ఈ సినిమానే నా సమాధానం: అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్-anupama parameshwaran says people trolled her that she can not act janaki vs state of kerala movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నాకు నటన రాదని ఎగతాళి చేశారు.. వాళ్లకు ఈ సినిమానే నా సమాధానం: అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

నాకు నటన రాదని ఎగతాళి చేశారు.. వాళ్లకు ఈ సినిమానే నా సమాధానం: అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

బబ్లీ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు నటన రాదని చాలా మంది ట్రోల్ చేసిన విషయాన్ని ఆమె వెల్లడించింది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో అనుపమ లీడ్ రోల్లో నటిస్తోంది.

నాకు నటన రాదని ఎగతాళి చేశారు.. వాళ్లకు ఈ సినిమానే నా సమాధానం: అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

ప్రేమమ్ మూవీ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటి అనుపమ పరమేశ్వరన్. గతేడాది టిల్లూ స్క్వేర్ లోనూ రెచ్చిపోయి నటించింది. తన సొంత ఇండస్ట్రీ మలయాళం కంటే తెలుగు ప్రేక్షకులకే ఎక్కువగా దగ్గరైంది. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడామె సురేష్ గోపీ మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ద్వారా మళ్లీ మలయాళంలోకి వెళ్తోంది. ఈ సందర్భంగా అనుపమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నన్ను ద్వేషించిన వాళ్లకు థ్యాంక్స్: అనుపమ

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ ఆడియో లాంచ్ సోమవారం (జూన్ 16) కొచ్చిలో జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కొందరి విమర్శల వల్లే తాను ఇప్పుడు తనను ఉత్తేజితం చేసే మూవీస్ ఎంచుకునేలా చేసిందని అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. “నేను నటించలేను అని ఎంతో మంది నన్ను ట్రోల్ చేశారు.

అలాంటివి ఎన్ని ఉన్నా కూడా ఈ సినిమా డైరెక్టర్ (ప్రవీణ్ నారాయణన్) నాకు లీడ్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాకు ఓ హృదయం ఉంది. అదే జానకి. అలాంటి పాత్రను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్” అని అనుపమ చెప్పింది.

అప్పుడే నేను చాలా మారిపోయాను

ఇక నుంచి మలయాళంలో తనను ఉత్తేజితం చేసే సినిమాలనే అంగీకరిస్తానని అనుపమ స్పష్టం చేసింది. “మలయాళంలో నేను ఎక్సైట్ అయ్యే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఈ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చేశాను. కొవిడ్ లాక్ డౌన్ లోనే నా కెరీర్, జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. నాపై నమ్మకం ఉంచినందుకు ప్రవీణ్ కు ధన్యవాదాలు.

ఇది చాలా లోతైన పాత్ర. ఓ బలమైన స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే సినిమా ఇది. అలాంటి పాత్రను నాకు ఇచ్చినందుకు ప్రవీణ్ కు థ్యాంక్స్. ఇదే నాకు గొప్ప ఘనతలా అనిపిస్తోంది. నాకు మద్దతుగా నిలిచిన వాళ్లకు, నన్ను ద్వేషించిన వాళ్లందరికీ థ్యాంక్స్. వాళ్ల వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను” అని అనుపమ చెప్పింది.

నయనతారలాగే అనుపమ కూడా..

ఇదే ఈవెంట్లో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో లాయర్ పాత్ర పోషిస్తున్న నటుడు, ఎంపీ సురేష్ గోపీ కూడా మాట్లాడాడు. సౌత్ ఇండస్ట్రీలో సిమ్రన్, నయనతార, అసిన్ కూడా ఇలాగే మొదట్లో ఇబ్బందులు పడ్డా.. తర్వాత స్టార్లు ఎదిగారని గుర్తు చేశాడు.

అనుపమ కూడా వాళ్లలాగే స్టార్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. గతంలో ఆమెను వద్దనుకున్న డైరెక్టర్లే భవిష్యత్తులో ఆమె డేట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని అనడం గమనార్హం. తాను చిన్నతనం నుంచి సురేష్ గోపీ సినిమాలు చూసే పెరిగానని, ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ చెప్పింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం