Anupama Parameswaran: టిల్లూ స్క్వేర్ కోసం నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే: అనుపమ-anupama parameshwaran received her best complement from neha shetty for tillu square movie siddu jonnalagadda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anupama Parameswaran: టిల్లూ స్క్వేర్ కోసం నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే: అనుపమ

Anupama Parameswaran: టిల్లూ స్క్వేర్ కోసం నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే: అనుపమ

Hari Prasad S HT Telugu

Anupama Parameswaran: టిల్లూ స్క్వేర్ మూవీలో తాను పోషించిన బోల్డ్ క్యారెక్టర్ పై అనుపమ పరమేశ్వరన్ ఎన్నో విమర్శలే కాదు.. ఓ బెస్ట్ కాంప్లిమెంట్ కూడా అందుకుందట. అది ఎవరిదో తెలుసా?

టిల్లూ స్క్వేర్ కోసం నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే: అనుపమ

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ అంటే ఇప్పటికీ తెలుగు వారికి శతమానం భవతిలో కనిపించే బబ్లీ గర్లే. ఎంతో పద్ధతైన పాత్రలే పోషిస్తుందని ప్రేక్షకులు ఫిక్సయ్యారు. కానీ టిల్లూ స్క్వేర్ మూవీలో సిద్దూ జొన్నలగడ్డతో రెచ్చిపోయి లిప్ లాక్ సీన్లలో నటించడంతో చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం తనకు మంచి కాంప్లిమెంట్ కూడా దక్కినట్లు ఆమె చెప్పింది.

అనుపమకు రాధిక కాంప్లిమెంట్

అనుపమ పరమేశ్వరన్ ఈ టిల్లూ స్క్వేర్ మూవీలో లిల్లీ పాత్రలో కనిపించింది. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన మూవీ కావడంతో ఆ స్టోరీకి కొనసాగింపుగానే ఈ సినిమా తీశారు. దీంతో ఆ మూవీలో ఉన్న రాధిక పాత్ర ఉండే ఇంట్లోనే ఈ మూవీలో లిల్లీ ఉన్నట్లు చూపించారు. అయితే ఈ సినిమాలో ఈ లిల్లీ నటనకుగాను ఆ రాధిక నుంచే కాంప్లిమెంట్ వచ్చిందట. ఆ రాధిక పాత్ర పోషించింది నేహా శెట్టి.

ఇదే తనకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ అని అనుపమ చెప్పడం విశేషం. "రాధికనే నాకు స్వయంగా ఫోన్ చేసి నా నటనను మెచ్చుకోవడం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్" అని అనుపమ చెప్పింది. నిజానికి ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆమె హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అశ్లీల కామెంట్స్ వల్లే ఆమె కాస్త అప్‌సెట్ అయిందని సిద్దూ జొన్నలగడ్డ చెప్పాడు.

అందుకే ఆమె రాలేదని అనడంతో అందరూ షాక్ తిన్నారు. తన బోల్డ్ పాత్రపై అంతకుముందు ఆమె గట్టిగానే సమాధానం చెప్పింది. బిర్యానీ ఇష్టమనీ ప్రతిసారీ అదే తినలేం కదా.. అలాగే ప్రతిసారీ ఒకేలాంటి పాత్రలు చేయలేమని చెప్పింది. అంతేకాదు ఈ మూవీలో బోల్డ్ సీన్స్ లో నటించడానికి తాను చాలానే కష్టపడ్డానని, అంత మంది ముందు అలాంటి సీన్స్ చేయడం చాలా ఇబ్బందే అని కూడా తెలిపింది.

మెప్పించిన టిల్లూ స్క్వేర్

అయితే టిల్లూ స్క్వేర్ మూవీ టీమ్ పడిన శ్రమకు తగిన ఫలితం దక్కినట్లే కనిపిస్తోంది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ఉండటంతో మంచి ఓపెనింగ్స్ లభించనున్నాయి. ఈ సినిమా థియేటర్ రన్ ముగిసేలోపు రూ.100 కోట్లు అంచనా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చెప్పాడు.

చాలా రోజుల పాటు ఎదురు చూసేలా చేసినా.. టిల్లు మరోసారి నవ్వుల వర్షంలో ముంచెత్తి హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా సిద్దూ జొన్నలగడ్డ నటనకు, అతని పంచ్ డైలాగులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా మొత్తం తన భుజాలపై మోశాడని ప్రశంసిస్తున్నారు. తొలి రోజే రూ.25 కోట్లు వస్తాయని భావిస్తున్నా.. అసలు నంబర్లు ఎలా ఉంటాయో చూడాలి.