OTT Comedy: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. 8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
Anukunnavanni Jaragavu Konni OTT Streaming: ఓటీటీలోకి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సైలెంట్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా అనుకున్నవన్నీ జరగవు కొన్ని. జనవరి 31 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 8.4 రేటింగ్ ఉండటం విశేషం. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.
Anukunnavanni Jaragavu Konni OTT Release: ఓటీటీలోకి వివిధ రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ప్రతి వారం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూనే ఉన్నాయి. వీటిలో తెలుగు నుంచి కూడా ఎన్నో రకాల జోనర్స్‌లో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్
అయితే, క్రైమ్, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ జోనర్స్ సినిమాలను సాధారణంగా ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే ఇలాంటి జోనర్స్‌లో ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. అలా గతేడాది థియేటర్లలో విడుదల అయిన తెలుగు క్రైమ్ కామెడీ సినిమానే అనుకున్నవన్నీ జరగవు కొన్ని. కామెడీకి క్రైమ్ ఎలిమెంట్స్‌తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
హీరోహీరోయిన్స్
అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమాలో శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక హీరోహీరోయిన్స్‌గా నటించారు. అలాగే, పోసాని కృష్ణమురళి, భంచిక్ బబ్లూ, కిరీటి, మిర్చి హేమంత్, గౌతంరాజు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు జి. సందీప్ దర్శకత్వం వహించారు. శ్రీ భరత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు గిడియన్ కట్టా సంగీతం అందించారు. అజయ్, చిన్నారావు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు.
సడెన్ ఓటీటీ స్ట్రీమింగ్
2024లో నవంబర్ 3న విడుదలైన అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ, పెద్దగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 8.4 రేటింగ్ సాధించుకుని సత్తా చాటింది అనుకున్నవన్నీ జరగవు కొన్ని మూవీ. ఇక ఈ మూవీ తాజాగా చడీ చప్పుడు లేకుండా సడెన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
రెంటల్ విధానంలో
అమెజాన్ ప్రైమ్‌లో అనుకున్నవన్నీ జరగవు కొన్ని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 31న ఓటీటీ రిలీజ్ అయిన అనుకున్నవన్నీ జరగవు కొన్ని మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, అనుకున్నవన్నీ జరగవు కొన్ని మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదే ట్విస్ట్
అంటే, అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రూ. 99 చెల్లించి చూడాలి. సడెన్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనుకున్నవన్నీ జరగవు కొన్ని అద్దె విధానంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అయితే, మరికొన్ని రోజుల్లో రెంటల్ విధానం కాకుండా ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాల్ బాయ్‌గా, కాల్ కార్ల్‌గా
ఇదిలా ఉంటే, అనుకున్నవన్నీ జరగవు కొన్ని మూవీ కథ విషయానికొస్తే.. కార్తీక్ (శ్రీరామ్ నిమ్మల) మధ్యతరగతి కుర్రాడు. అతడికి 30 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. దాంతో ఎవరిని అడిగిన డబ్బులు దొరకని పరిస్థితుల్లో కాల్‌బాయ్‌గా మారతాడు. మధు ( కలపాల మౌనిక) కూడా కార్తీక లాగానే అనుకోని పరిస్థితుల్లో కాల్ గర్ల్‌గా పని చేస్తుంటుంది.
ఈ క్రమంలో వారిద్దరూ ఓ హత్య కేసులో ఇరుకొని ఇబ్బందుల్లో పడతారు. దాని నుంచి కార్తీక్, మధు ఎలా బయటకు వచ్చారు? హత్య కాబడింది ఎవరు వారిని ఎవరు ఎందుకు హత్య చేశారు? అనే విషయాలను కామెడీ యాడ్ చేసి తెరకెక్కించారు.
సంబంధిత కథనం