ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించిన మలయాళం మూవీ దావీద్ ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైంది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గోవింద్ విష్ణు దర్శకత్వం వహించాడు. లిజోమోల్ జోస్ హీరోయిన్‌గా నటించింది. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే..
ఆషిక్ అబు( ఆంటోనీ వర్గీస్) సెలిబ్రిటీలకు బౌన్సర్‌గా పనిచేస్తుంటాడు. కోపం ఎక్కువ. అదే అతడి ఉపాధికి అడ్డంకిగా మారుతుంది. అబుకు కూతురు కుంజిలి అంటే ప్రాణం. తండ్రిని హీరోలా భావిస్తుంటుంది కుంజిలి. టర్కీకి చెందిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ సైనుల్ అక్మదేవ్ వెకేషన్ కోసం గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కేరళకు వస్తాడు. కేరళ స్పోర్ట్స్ క్లబ్ సైనుల్ కోసం ఓ సన్మాన వేడుక ఏర్పాటుచేస్తుంది.
ఈ వేడుకలో జరిగిన గొడవలో ఆషిక్ అబు పంచ్ దెబ్బకు సైనుల్ స్పృహ కోల్పోతాడు. ఈ ఘటనతో ఓవర్‌నైట్‌లో హీరోగా మారిపోతాడు ఆషిక్ అబు. తనకు జరిగిన అవమానం సహించలేని సైనుల్ బాక్సింగ్ రింగ్‌లో తనతో తలపడమని అబుతో ఛాలెంజ్ చేస్తాడు. సైనుల్ ఛాలెంజ్‌కు అబు ఒప్పుకోడు.
బౌన్సర్‌గా పనిచేసే టైమ్‌లో సామాన్యులపై అబు దాడిచేసిన కొన్ని వీడియోలు బయటకు వస్తాయి. వాటి ద్వారా అబుపై రౌడీగా ముద్రపడుతుంది. కూతురు కూడా తనను రౌడీగానే చూడటంతో సైనుల్‌తో బాక్సింగ్ ఫైట్‌కు అబు సిద్ధమవుతాడు. ఆ తర్వాత ఏమైంది?
క్లబ్ బాక్సింగ్ పోటీలలో ఓటమే లేని ప్లేయర్‌గా పేరుతెచ్చుకున్న అబు బాక్సింగ్‌కు పదేళ్లు ఎందుకు దూరమయ్యాడు? అబు కోపం వల్ల ఓ నేషనల్ ప్లేయర్ జీవితం ఎలా నాశనమైంది? సైనుల్‌తో జరిగిన పోటీలో అబు గెలిచాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు దక్షిణాదిలో చాలానే వచ్చాయి. దావీద్ కూడా అలాంటి రెగ్యులర్ టెంప్లేట్ మూవీనే. బాక్సింగ్ నేపథ్యానికి తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని జోడించి దర్శకుడు గోవింద్ విష్ణు ఈ మూవీని తెరకెక్కించాడు. ఓ స్లమ్ యువకుడికి, ఇంటర్నేషనల్ బాక్సర్‌కు మధ్య మొదలైన ఈగో ఇష్యూస్ ఎలాంటి పరిణామాలకు దారితీశాయి అనే పాయింట్‌తో దావీద్ మూవీ తెరకెక్కింది.
స్టోరీని రొటీన్‌గానే రాసుకున్న దర్శకుడు స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం కొత్తగా అడుగులు వేశాడు. సాధారణంగా క్లైమాక్స్‌లో విలన్‌పై హీరో గెలవడం కామన్. కానీ దావీద్ సినిమాను భిన్నంగ్ ఎండ్ చేశాడు డైరెక్టర్. కోపం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందనే సందేశాన్ని ఇచ్చారు.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌ను స్టైలిష్‌గా సాగాయి. ఈ ఫైట్ సీక్వెన్స్‌లతో ఆడియెన్స్‌కు హై మూవ్‌మెంట్ ఫీలింగ్‌ను కలిగించాడు. హీరో ఎంట్రీ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన పీరియాడికల్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని నాచురల్‌గా చూపించారు. కీలకమైన సెకండాఫ్‌లో దర్శకుడు తడబడిపోయాడు.
ఇంటర్నేషనల్ బాక్సర్‌తో ఫైట్ కోసం అబు సిద్ధమయ్యే ఎపిసోడ్స్ సాగతీతగా అనిపిస్తాయి.అబు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు.
ఫ్యామిలీ మ్యాన్‌గా, బాక్సర్‌గా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో ఆంటోనీ వర్గీస్ చక్కటి వేరియేషన్ చూపించాడు. బాక్సర్ రోల్ కోసం ఫిజికల్‌గా చాలా మేకోవర్ అయ్యాడు. కుటుంబ బాధ్యతలు మోసే గృహిణిగా లిజోమోల్ జోస్ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. రొమాంటిక్ ట్రాక్, డ్యూయెట్ సాంగ్స్ లేకుండా హీరోహీరోయిన్ల అనుబంధాన్ని చాలా సహజంగా చూపించారు డైరెక్టర్.
జస్టిన్ వర్గీస్ తన బీజీఎమ్‌తో యాక్షన్ సినిమా ఫీల్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు.
దావీద్ యాక్షన్ సినిమాలు చూసే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. మలయాళం వెర్షన్ మాత్రమే జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం