Antony Review: ఆంటోనీ రివ్యూ - జోజు జార్జ్ , క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?-antony review joju george kalyani priyadarshan gangster action movie review aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Antony Review Joju George Kalyani Priyadarshan Gangster Action Movie Review Aha Ott

Antony Review: ఆంటోనీ రివ్యూ - జోజు జార్జ్ , క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Feb 27, 2024 09:16 AM IST

Antony Review: జోజు జార్జ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆంటోనీ ఈ మూవీ ఇటీవ‌ల ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఆంటోనీ మూవీ రివ్యూ
ఆంటోనీ మూవీ రివ్యూ

Antony Review: జోజు జార్జ్(Joju George), క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ (Kalyani Priyadarshan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఆంటోనీ గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించింది. అదే పేరుతో తెలుగులోకి డ‌బ్ అయిన ఈ మూవీ ఇటీవ‌ల‌ ఆహా ఓటీటీలో (Aha OTT) రిలీజైంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి జోషి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఎలా ఉందంటే?

గ్యాంగ్‌స్ట‌ర్ ఆంటోనీ...

జేవియ‌ర్ అనే రౌడీని ఆంటోనీ (జోజు జార్జ్‌) చంపేస్తాడు. జేవియ‌ర్ భార్య జెస్సీ (ఆశా శ‌ర‌త్‌) ఆ హ‌త్య‌ను క‌ళ్లారా చూస్తుంది. కానీ ఆంటోనీకి వ్య‌తిరేకంగా సాక్ష్యం చెప్ప‌దు. ఓ ప్ర‌మాదంలో జెస్సీ కూడా చ‌నిపోవ‌డంతో ఆమె కూతురు మ‌రియాకు (క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌) గార్డియ‌న్‌గా ఆంటోనీ ఉండాల్సివ‌స్తుంది. మ‌రియా... మిక్స్‌డ్‌ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్లేయ‌ర్‌. అల్ల‌రిత‌నం, ధైర్యం రెండు ఎక్కువే. త‌న‌కు అడ్డొచ్చిన వారిని చిత‌క్కొడుతుంది. కాలేజీ గొడ‌వ‌ల కార‌ణంగా మ‌రియా హాస్ట‌ల్ వ‌దిలిపెట్టాల్సివ‌స్తుంది.

మ‌రియాను త‌న ఇంటికే తీసుకొస్తాడు ఆంటోనీ. మ‌రియాను త‌న కూతురిగా భావిస్తాడు. కానీ వారి మ‌ధ్య బంధాన్ని ఊరిలోని కొంద‌రు పెద్ద‌లు త‌ప్పుప‌డ‌తారు. మ‌రోవైపు త‌న అన్న‌య్య జేవియ‌ర్ చావుకు కార‌ణ‌మైన ఆంటోనీపై అత‌డి త‌మ్ముడు టార్జ‌న్ ప‌గ‌తో ర‌గిలిపోతుంటాడు. ఆంటోనీపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి అత‌డి ఆప్తుల‌పై ఎటాక్స్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు?

టార్జ‌న్ బారి నుంచి మ‌రియాతో పాటు త‌న వాళ్ల‌ను ఆంటోనీ ఎలా కాపాడుకున్నాడు? క‌రుడుగ‌ట్టిన రౌడీగా జీవిస్తున్న ఆంటోనీలో మ‌రియా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? భ‌ర్త జేవియ‌ర్‌ను త‌న క‌ళ్ల ముందే ఆంటోనీ హ‌త్య చేసినా అత‌డికి వ్య‌తిరేకంగా జెస్సీ ఎందుకు సాక్ష్యం చెప్ప‌లేదు. త‌న నిజ‌మైన తండ్రిని క‌ల‌వాల‌నే మ‌రియా కోరిక‌ను ఆంటోనీ ఎలా నెర‌వేర్చాడు? ఆంటోనీతోనే క‌లిసి ఉండాల‌ని అనుకున్న మ‌రియా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ది? ఆంటోనీ ఫ్యామిలీ చావుకు కార‌కులు ఎవ‌రు? అన్న‌దే ఆంటోనీ మూవీ(Antony Review) క‌థ‌.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ...

తండ్రీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంతో గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆంటోనీ మూవీని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ జోషి. ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ రెండు ప‌ర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యే సినిమాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాంటి వాటిలో ఆంటోనీ(Antony Review) ఒక‌టిగా త‌ప్ప‌కుండా నిలుస్తుంది.

ఫుల్ మాసీ మూవీ...

తండ్రీ కూతుళ్ల క‌థ అంటే సెంటిమెంట్‌తో ఓవ‌ర్ మెలో డ్రామాతో కూడి ఉంటాయి. కానీ ఆంటోనీ మూవీని యాక్ష‌న్ అంశాల‌తో ఫుల్ మాసీగా సాగుతుంది. జోజు జార్జ్‌లోని హీరోయిజాన్ని చాటిచెప్పే యాక్ష‌న్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయి. మ‌రియా విష‌యంలో ప్రిన్సిపాల్‌కు ఆంటోనీ వార్నింగ్ ఇచ్చే సీన్‌, పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వ‌డానికి అత‌డు చేసే ఫైట్‌ థ్రిల్‌ను పంచుతాయి. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ క్యారెక్ట‌ర్‌ను కూడా సాఫ్ట్‌గా రాకుండా ర‌ఫ్ అండ్ ట‌ఫ్ అమ్మాయిగా చూపించాడు.

ట్రీట్‌మెంట్ కొత్త‌గా...

క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌లో కూతురు మార్పు తీసుకురావ‌డం అనే పాయింట్ చాలా సినిమాల్లో వ‌చ్చిందే. రొటీన్ పాయింట్‌ను త‌న ట్రీట్‌మెంట్‌తో కొత్త‌గా చెప్పాడు డైరెక్ట‌ర్‌. జోజు జార్జ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ బాండింగ్‌, వారిద్ధ‌రి మ‌ధ్య డ్రామాను బోర్ లేకుండా ఎంగేజింగ్‌గ్‌ న‌డిపించాడు. సెంటిమెంట్ డోస్ ఎక్కువైపోతుంద‌నుకున్న టైమ్‌లో ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌....యాక్ష‌న్ ఎక్కువైపోతుంద‌నే అనుకునే లోపు మంచి ఎమోష‌న‌ల్ సీన్‌తో మూవీ(Antony Review) ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు సినిమాలో ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం బాగుంది. ఫాద‌ర్ పాల్‌గా చెంబ‌న్ వినోద్ జోస్‌, మాయ‌గా నైలా ఉషా క్యారెక్ట‌ర్స్ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌గా హీరోను ప‌రిచ‌యం చేస్తూ..మంచి మ‌నిషిగా మారే సీన్‌తో ఎండ్ చేయ‌డం కూడా కొత్త‌గా అనిపిస్తుంది.

హీరోయిజం ఇరికించారు...

జోజు జార్జ్‌లోని హీరోయిజాన్ని చూపించ‌డానికే కొన్ని స‌న్నివేశాల‌ను ఇరికించిన ఫీలింగ్ క‌లుగుతుంది. అవ‌రాన్‌, నైలా ఉషా ట్రాక్ బాగున్నా...కొన్ని సంద‌ర్భాల్లో క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది.

జోజు జార్జ్ ఆల్‌రౌండ్ షో...

ఆంటోనీ అనే గ్యాంగ్‌స్ట‌ర్‌గా మాస్ పాత్ర‌లో జోజు జార్జ్ అద‌ర‌గొట్టాడు. అల్‌రౌండ‌ర్‌గా అన్ని ర‌కాల ఎమోష‌న్స్ చ‌క్క‌గా ఈ సినిమాలో ప‌ల‌కించాడు. ర‌గ్గ్‌డ్ లుక్‌లో జోజు జార్జ్ క్యారెక్ట‌ర్‌ను విభిన్నంగా డిజైన్‌ చేసుకోవ‌డం బాగుంది. రెగ్యుల‌ర్ హీరోయిన్‌గా కాకుండా మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్లేయ‌ర్‌గా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ డేరింగ్ అండ్ డాషింగ్‌గా చూపించారు. ఈ పాత్ర‌ను బాగా ఓన్ చేసుకొని న‌టించింది. హీరోకు మార్గ‌ద‌ర్శ‌కుడిగా ఉండే పాత్ర‌లో చెంబ‌న్ వినోద్ జోస్ న‌ట‌న బాగుంది. నైలా ఉషా, ఆశా శ‌ర‌త్ న‌ట‌న ఓకే అనిపిస్తుంది.

క‌థ పాత‌దే ట్రీట్‌మెంట్‌...

ఆంటోనీ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించే డిఫ‌రెంట్ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. క‌థ పాత‌దే అయినా స్క్రీన్‌ప్లే, యాక్ష‌న్ ఎపిసోడ్స్ మాత్రం కొత్త‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.

IPL_Entry_Point