Ankita Lokhande: 19 ఏళ్లకే హీరోయిన్ ఛాన్స్.. నిర్మాతతో పడుకోవాలని కండిషన్.. సౌత్‌పై సీరియల్ నటి కామెంట్స్
Ankita Lokhande About Casting Couch: బిగ్ బాస్ హిందీ 17వ సీజన్‌తో బాగా పాపులర్ అయిన బుల్లితెర జంట అంకిత లోఖండే, విక్కీ జైన్. వీళ్లు తరచు గొడవలతో సీజన్ మొత్తం హైలెట్ అయ్యారు. అయితే, తనకు 19 ఏళ్లకే హీరోయిన్‌గా ఆఫర్ వచ్చిందని, కానీ నిర్మాతతో పడుకోవాలని కండిషన్ పెట్టారని అంకిత లోఖండే చెప్పుకొచ్చింది.
Ankita Lokhande Casting Couch: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. ఎక్కడో ఓ చోట ఎవరో ఒక హీరోయిన్ ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి స్టార్ హీరోయిన్స్ సైతం గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నవారే. కొంతమంది వీటికి తలొంచితే.. మరికొందరు ఎదురితిరిగి తమ టాలెంట్‌తో పైకి వచ్చినవాళ్లు ఉన్నారు. ఇప్పటికీ ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై ఎంతో మంది హీరోయిన్స్ తమ గళం విప్పారు. తాజాగా ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది అంకిత లోఖండే.
చేదు అనుభవం
బిగ్ బాస్ హిందీ 17వ సీజన్ ద్వారా సూపర్ పాపులర్ అయిన బుల్లితెర జంట అంకిత లోఖండే-విక్కీ జైన్. వీళ్దిద్దరు తరచూ గొడవలు పడుతూ, అరుస్తూ సీజన్ మొత్తం హైలెట్ అయ్యారు. అయితే, ఈ షో వల్ల ఎక్కువగా నెగెటివిటీ మూటగట్టుకుంది అంకిత లోఖండే. అలా సూపర్ పాపులర్ అయిన ఈ బ్యూటి అంకిత తాజాగా తనకు 19 ఏళ్లప్పుడు ఎదురైన చేదు అనుభవం గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
హోటల్‌కు వెళ్లాను
"నేను దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ ఆడిషన్‌కు వెళ్లాను. అనంతరం వాళ్లు నాకు కాల్ చేసి నేను సెలెక్ట్ అయ్యాను. వచ్చి సంతకం చేయండని చెప్పారు. దాంతో నేను సంతోషంతో ఎగిరి గంతేశాను. ఈ విషయం అమ్మకు చెప్పి తెగ సంబరపడిపోయాను. ఇంత తేలిగ్గా నన్ను ఎలా సెలెక్ట్ చేశారనే డౌట్ కూడా వచ్చింది. కానీ, సినిమాకు ఓకే చెప్పాను. ఇక నేను సంతకం చేయాల్సింది ఉంది. అందుకు నేను ఓ హోటల్‌కు వెళ్లాల్సి వచ్చింది" అని బిగి బాస్ బ్యూటి అంకిత లోఖండే తెలిపింది.
నిర్మాతతో పడుకోవాలి
అంకిత లోఖండే ఇంకా కొనసాగిస్తూ "నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు. నేను లోపలకి వెళ్లాక నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగారు. నాకు అప్పుడు 19 ఏళ్లు. నన్ను హీరోయిన్ చేస్తారేమోనని కాంప్రమైజ్ అంటే ఏంటని అడిగాను. దానికి వాళ్లు ఒక రాత్రి నిర్మాతతో పడుకోవాలని చెప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటా. కేవలం పడుకోడానికి అమ్మాయి కావాలి అనుకుంటా. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి వచ్చేశాను" అని చెప్పుకొచ్చింది.
అడిగే హక్కు ఎవరిచ్చారు
"ఇండస్ట్రీలో కానీ, ఇంకా ఎక్కడైనా కానీ నాతో పడుకోవాలని అడిగే హక్కు ఎవ్వరికీ ఇవ్వకూడదు అని ఆ రోజు నాకు అనిపించింది. ఆరోజు నేను చాలా నిరాశ చెందాను. నా గురించి నేను చాలా తక్కువగా భావించాను. ఎవరైనా నన్ను ఇలా ఎలా అడగగలరు? అని చాలా బాధేసింది. ఆ రోజు నేను సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మళ్లీ నన్ను అలా అడిగే హక్కు ఎవరికీ ఇవ్వదల్చుకోలేదు. అది చాలా నీచమైంది. ఆపై ఏమి జరిగినా సరే అని నేను నిర్ణయించుకున్నాను" అని అంకిత తెలిపింది.
చాలా సంతోషంగా చేశాను
"అనంతరం నా టెలివిజన్ పరిశ్రమతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత నాకు ఈ పవిత్ర రిష్ట సీరియల్ అవకాశం వచ్చింది. దాంతో సంతోషంగా ఆ సీరియల్ చేశాను" అని అంకిత లోఖండే తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపింది. అయితే, ఈ పవిత్ర రిష్ట సీరియల్ ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అంకిత లోఖండే.
అంతేకాకుండా హిందీ బుల్లితెర రంగంలో ఈ సీరియల్ పేరు అంకిత లోఖండే ఇంటిపేరుగా మారింది. ఈ సీరియల్‌లో దివంగత సుశాంత్ రాజ్ పుత్ సింగ్ హీరోగా చేశాడు.