Anjali Jhansi 2 Web Series: టాలీవుడ్ నటి అంజలి వరుస పెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది. హీరోయిన్ రోల్స్‌లోనే కాకుండా వెబ్ సిరీస్, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. తమిళం, తెలుగులో ఇలా ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగులో ఝాన్సీ అనే వెబ్‌సిరీస్‌తో సందడి చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌తో ఆమెకు తెలుగులో మంచి ఆదరణ దక్కింది. త్వరలో ఈ సిరీస్‌కు సీక్వెల్ రాబోతుంది.,ఝాన్సీ సీజన్ 2కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జనవరి నుంచి ఈ రెండో భాగాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఝాన్సీ-2 పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.,ఈ సిరీస్‌లో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా మొదటి సారిగా ఆమె యాక్షన్ స్టంట్లతో అదరగొట్టింది. హౌస్ వైఫ్ పాత్రతో పాటు.. ప్రొఫెషనల్ ఫైటర్‌గా రెండు విభిన్న పాత్రల్లో అంజలి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఫస్ట్ సీజన్‌లో అసంపూర్ణంగా ఉన్న ప్రశ్నలకు ఈ రెండో భాగంలో సమాధానాలు ఇవ్వనున్నారు. గతం మరిచిపోయిన అమ్మాయిగా కనిపించిన అంజలి.. తన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తూ సాగించే ప్రయాణమే ఝాన్సీ.,ఈ వెబ్ సిరీస్‌ను ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కృష్ణ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు తిరు ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా జోనర్‌లో ఇది రాబోతుంది. ఈ మొదటి భాగంలో అంజలితో పాటు చాందినీ చౌదరీ, అబ్‌రామ్, ఆదర్శ బాలకృష్ణ, శరణ్య, రాజ్ అర్జున్, కల్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 2023 నుంచి ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.,,