Geethanjali Sequel: బాక్సాఫీస్ పోటీకి భయపడి వెనక్కి తగ్గిన అంజలి హారర్ మూవీ - గీతాంజలి సీక్వెల్ పోస్ట్‌పోన్
Geethanjali Malli vachindi postponed: అంజలి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. మార్చి 22న కాకుండా ఏప్రిల్ 11న ఈ హారర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు కోన వెంకట్ తెలిపాడు.
Geethanjali Malli vachindi postponed: టాలీవుడ్‌లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఎన్టీఆర్ దేవరతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ తారుమారు అయ్యాయి. ఈ లిస్ట్‌లో అంజలి హారర్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా చేరింది. ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అయితే మార్చి 22న పలు టాలీవుడ్ మూవీస్ బాక్సాఫీస్ బరిలో నిలవడంతో గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్‌ను వాయిదావేశారు. మార్చి 22న కాకుండా ఏప్రిల్ 11న తమ మూవీ రాబోతున్నట్లు ప్రకటించారు.
ట్విట్టర్ ద్వారా కోన వెంకట్...
గీతాంజలి మళ్లీ వచ్చింది పోస్ట్‌పోన్ అవుతోన్నట్లుగా కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. మార్చి 22న ఓం భీమ్ బుష్, రోటి కపడా, రొమాన్స్‌తో పాటు అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలు రిలీజ్ అవుతోన్నాయని, మేం కొంచెం వాళ్ళకి స్పేస్ ఇస్తూ .. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీని కొంచెం ముందుకు జరిపి ఏప్రిల్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.
గీతాంజలికి సీక్వెల్...
గీతాంజలి మళ్లీ వచ్చిందిలో అంజలితో పాటు శ్రీనివాసరెడ్డి, సత్యంరాజేష్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు. 2014లో రిలీజైన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ తెరకెక్కుతోంది. గీతాంజలి మూవీకి రాజ్‌కిరణ్ దర్శకత్వం వహించాడు. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ తెరకెక్కుతోంది.హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీతో శివతుర్లపాటి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు.ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శ్మాశన వాటికలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ మేకర్స్ నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో చక్కటి ఆదరణ లభిస్తోంది
అంజలి 50వ సినిమా...
అంజలి హీరోయిన్‌గా నటిస్తోన్న 50వ మూవీ ఇది. చాలా కాలం తర్వాత తెలుగులో ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. గత కొంతకాలంగా హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటోన్న అంజలి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌లో కీలక పాత్ర చేసింది. ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నది.
బహిష్కరణ వెబ్ సిరీస్…
సినిమాలపై ఫోకస్ పెడుతూనే వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది అంజలి. ఫాల్ అనే వెబ్‌సిరీస్‌లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫాల్ తర్వాత తెలుగులో బహిష్కరణ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది. నివీన్ పాల్, అంజలి హీరోహీరోయిన్లుగా నటించిన యజు కాదల్ యజు మలై మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
టాపిక్