Jhansi Season 2 Review : అంజలి గతం ఎందుకు మరిచిపోయింది.. ఝాన్సీ సీజన్ 2 రివ్యూ
Jhansi Season Web Series 2 Review : టాలీవుడ్ హీరోయిన్ అంజలి, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఝాన్సీ. మెుదటి సీజన్ ఒకే అనినిపించింది. ఇటీవలే రెండో సీజన్ విడుదలైంది. ఇంతకీ ఎలా ఉంది?
ఝాన్సీ సీజన్ 2 నటీనటులు : అంజలి, చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, సంయుక్త, చైతన్య, రుద్ర ప్రతాప్, రామేశ్వరి తాళ్లురి తదితరులు, రచన : గణేశ్ కార్తీక్, సంగీతం : శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ బ్యానర్ : ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్ మెంట్స్, నిర్మాతలు : కృష్ణ కులశేఖరన్, కేఎస్ మధుబాల, దర్శకత్వం : గణేశ్ కార్తీక్, ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఎపిసోడ్స్ : 4
ట్రెండింగ్ వార్తలు
ఝాన్సీ మెుదటి సీజన్ ఆకట్టుకుంది. అక్టోబర్ 27, 2022న విడుదలైన సీజన్ 1 కాస్త ఆసక్తిగానే సాగింది. తాజాగా ఝాన్సీ సీజన్ 2 విడుదలైంది. మెుదటి సీజన్ చూస్తే.. కథ అర్థమవుతుంది. కథను అప్పుడే రివీల్ చేయకుండా రెండో సీజన్ మీద ఇంట్రస్ట్ పెంచాడు దర్శకుడు.
కథ :
మెుదటి సీజన్ చూసుంటే.. గోవాలో ఝాన్సీ (అంజలి), ధ్రువ (చైతన్య సగిరాజు) ఇద్దరిని బిల్లు క్లబ్ నిర్వాహకులు కిడ్నాప్ చేస్తారు. దీంతో సీజన్ 1 ముగుస్తుంది. ఆ సీజన్లోనే బిల్లు క్లబ్ అనే వేశ్య గృహానికి మహిత(అంజలి), బార్బీ (చాందినీ చౌదరి)లను అమ్మేయడం ఉంటుంది. రెండో సీజన్ ఝాన్సీ గతం గురించి తెలుసుకోవడంతో మెుదలవుతుంది. తన గతంలో ఏం జరిగిందని తెలుసుకునేందుకు అన్వేషణ మెుదలుపెడుతుంది. వేశ్య గృహంలో ఝాన్సీకి ఏం జరిగింది? అంత క్లోజ్ గా ఉండే బార్బీ ఎందుకు దూరమైంది? ఝాన్సీకి సాయం చేసిన వారు ఎవరు? విలన్ కాలేబ్ కొడుకు ఈథన్ ను ఎందుకు చంపాల్సి వచ్చింది? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఝాన్సీ సీజన్ 2 చూడాల్సిందే..
విశ్లేషణ :
ఝాన్సీ, బార్బీ బిల్లు క్లబ్ లోకి వచ్చాక వారి మానసిక స్థితి ఎలా ఉందనే విషయాన్ని చూపించాడు దర్శకుడు. ఈ సీజన్లో ఫ్లాష్ బ్యాక్ కథనే ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ స్టోరీ చుట్టే.. ప్రజెంట్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. గతం మరిచిపోయిన మహిత.. ఎక్కడ ఉండేది.. ఏం చేసింది.. ఎవరు సాయం చేశారనేది ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాడు దర్శకుడు. అయితే అంజలిని మాత్రం కొత్తగా చూపించాడు. యాక్షన్స్ సీన్స్ కొన్ని అదిరిపోయేలా ఉంటాయి. అంజలి చేస్తున్న ఫైట్స్ ఆకట్టుకుంటాయి.
రోటిన్ రివేంజ్ స్టోరీలాగానే ఈ సిరీస్ సాగుతుంది. అయితే మహితకు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది సరిగా రాసుకుంటే ఇంకా బాగుండేది. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక వేశ్య పగ తీర్చుకోవడమే ఝాన్సీ స్టోరీ లైన్. ఈ కథలోని క్యారెక్టర్లు కూడా బాగా రాసుకున్నారు. నటీనటులు పాత్రలకు తగ్గట్టుగా చేశారు. అయితే యాక్షన్స్ సీన్స్ మాత్రమే బాగుంటాయి. మిగతాది కథ అలా అలా సాగిపోతుంది. కొన్ని సమయల్లో కథ స్లోగా వెళ్లినట్టుగా అనిపిస్తోంది. మెుదటి సీజన్లో చాందినీ చౌదరికి ఇచ్చిన స్క్రీన్ స్పేస్... రెండో సీజన్లో కాస్త తక్కువైందనే చెప్పొచ్చు. అయితే మూడో సీజన్ కు మాత్రం చాందినీ చౌదరి స్ట్రాంగ్ బేస్. రెండో సీజన్ కు ముగింపు.. మూడో సీజన్ కు పునాదిగా ఆమె దగ్గర నుంచే ఉంటుంది.