VD 12: విజయ్ దేవరకొండ మూవీ గ్లింప్స్ ఆలస్యానికి కారణం ఎవరో చెప్పిన నిర్మాత-anirudh ravichander is the reason for delaying vd12 glimpse producer naga vamsi hints ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vd 12: విజయ్ దేవరకొండ మూవీ గ్లింప్స్ ఆలస్యానికి కారణం ఎవరో చెప్పిన నిర్మాత

VD 12: విజయ్ దేవరకొండ మూవీ గ్లింప్స్ ఆలస్యానికి కారణం ఎవరో చెప్పిన నిర్మాత

Chatakonda Krishna Prakash HT Telugu
Published Oct 26, 2024 12:41 PM IST

VD 12: విజయ్ దేవరకొండ తదుపరి మూవీ గ్లింప్స్ ఆలస్యమవుతూనే ఉంది. టైటిల్‍తో గ్లింప్స్ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలస్యానికి కారణం ఎవరో నిర్మాత నాగవంశీ తాజాగా వెల్లడించారు.

VD 12: విజయ్ దేవరకొండ మూవీ గ్లింప్స్ ఆలస్యానికి కారణం ఎవరో చెప్పిన నిర్మాత
VD 12: విజయ్ దేవరకొండ మూవీ గ్లింప్స్ ఆలస్యానికి కారణం ఎవరో చెప్పిన నిర్మాత

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా అప్‍డేట్స్ కోసం ఫ్సాన్స్ నిరీక్షిస్తున్నారు. ఈ మూవీకి జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండకు 12వ మూవీ కావటంతో వర్కింగ్ టైటిల్ ‘వీడీ12’గా ఉంది. అయితే, ఈ చిత్రం నుంచి టైటిల్‍తో గ్లింప్స్ వస్తుందని చాలాకాలంగా వినిపిస్తున్నా.. ఆలస్యమవుతూ వస్తోంది. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నిర్మాత నాగవంశీ. ఈ క్రమంలో వీడీ12 గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన రియాక్ట్ అయ్యారు.

అనిరుధ్ వల్లే..

వీడీ12 టైటిల్ వస్తోందని చాలాసార్లు రూమర్లు వచ్చాయని, ఎప్పుడు వస్తుందని గల్టీకి ఇచ్చిన ఇంటర్వ్వూలో నాగవంశీకి ప్రశ్న ఎదురైంది. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వల్ల ఆలస్యమవుతోందని నాగవంశీ హింట్ ఇచ్చారు.

అనిరుధ్ అనుకున్నప్పుడే అన్నీ వస్తాయని నాగవంశీ చెప్పారు. “టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అనిరుధ్‍తో ఏదైనా మనం అనుకుంటే రాదు. అతను అనుకోవాలి ఫస్ట్. అతడు అనుకుంటేనే వస్తాయి అన్నీ” అని నాగవంశీ చెప్పారు.

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్‍గా ఉన్నారు. అతడి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అనిరుధ్ మ్యూజిక్ అంటేనే మూవీకి క్రేజ్ పెరిగిపోయే పరిస్థితి ఉంది. తెలుగులో ఇటీవల దేవరతోనే అనిరుధ్ దుమ్మురేపాడు. దీంతో, మూవీకి అనిరుధ్ సైన్ చేసినా.. అతడు ఎప్పుడు మ్యూజిక్ ఇస్తాడో కూడా కొన్ని సినిమాలకు క్లారిటీ లేదని తెలుస్తోంది. నాగవంశీ కూడా అదే విధంగా కామెంట్స్ చేశారు.

వీడీ12 నుంచి దీపావళి సందర్భంగా గ్లింప్స్ వీడియో వస్తుందని, టైటిల్ రివీల్ అవుతుందనే రూమర్లు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నాగవంశీ చెప్పిన మాటలను బట్టి చూస్తే దీపావళికి కూడా గ్లింప్స్ వచ్చేలా కనిపించడం లేదు. గ్లింప్స్ వీడియోకు అనిరుధ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు ఇస్తాడో ఈ మూవీ టీమ్‍కు ఇంకా ఖరారు కానట్టు టాక్.

వీడీ12 మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. ముందుగా ఈ ప్రాజెక్టులో శ్రీలీల ఉండగా.. ఆమె తప్పుకున్నారు. భాగ్యశ్రీని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండ లుక్ ఆసక్తిని అమాంతం పెంచేసింది. ఇంటెన్స్ లుక్‍తో ఓ పోస్టర్ వచ్చింది. ఈ చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రను విజయ్ పోషిస్తున్నారని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నాయి.

సందిగ్ధంలో రిలీజ్

వీడీ12 మూవీని 2025 మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు ఇటీవలే ఆ డేట్‍ను ఖరారు చేసుకుంది. దీంతో వీడీ12 రిలీజ్ డేట్ సందిగ్ధంలో పడింది. హరి హర వీరమల్లు ఆ తేదీనే వస్తే విడుదల పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Whats_app_banner