OTT: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-animated science fiction film the wild robot now streaming on jiohotstar in telugu also ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 18, 2025 09:38 AM IST

OTT Sci Fi Movie: ది వైల్డ్ రోబోట్ చిత్రం తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఐదు భాషల్లో ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

OTT Sci Fi Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Sci Fi Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ది వైల్డ్ రోబోట్’ సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. భారీ కలెక్షన్లను సాధించింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజైంది. పాజిటివ్ టాక్‍ను సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే ఇంగ్లిష్‍లో ఓటీటీలోకి వచ్చింది. అయితే, నేడు (ఫిబ్రవరి 18) తెలుగు సహా ఐదు భాషల్లో మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇవే..

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ది వైల్డ్ రోబోట్ సినిమా నేడు జియో హాట్‍స్టార్ (డిస్నీప్లస్ హాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పటికే ఇంగ్లిష్‍లో ఈ చిత్రం అడుగుపెట్టింది. అయితే, ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ది వైల్డ్ రోబోట్.. యానిమేటెడ్ మూవీగా వచ్చింది. నటీనటులు బోట్లో వేషంలోనే ఉంటారు. లిపితా న్యోగో, పెడ్రో పాస్కర్, కిట్ కోనోర్, కెథరీన్ ఓ హారా, బిల్లీ నైయీ, స్టీఫెన్, మార్క్ హామిల్ ఈ మూవీకి వర్క్ చేశారు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ డ్రామా డైరెక్టర్ క్రిస్ సాండెర్స్ తెరకెక్కించారు.

ది వైల్డ్ రోబోట్ కలెక్షన్లు

ది వైల్డ్ రోబోట్ చిత్రం 78 మిలియన్ డాలర్ల (సుమారు రూ.677 కోట్లు) బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం 329 డాలర్ల (రూ.2,800కోట్లు) కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ప్రొడ్యూజ్ చేశారు.

ఈ వారంలోనే ఆఫీస్ వెబ్ సిరీస్

తమిళ వెబ్ సిరీస్ ‘ఆఫీస్’ ఫిబ్రవరి 21వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో గురు లక్ష్మణ్ శబరీశ్, స్మేహ, కీర్తివేల్, కేమి, పరంథామన్, తమిళవాణి, శివ అరవింద్ కీలకపాత్రలు పోషించారు. ఓ తహశీల్దార్ కార్యాలయంలో జరిగే ఘటనల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఆఫీస్ వెబ్ సిరీస్‍కు కబీజ్ దర్శకత్వం వహించారు.

శ్వేతబసు ప్రసాద్, ఆషిమ్ గులాటీ, జావెద్ జాఫెరీ కలిసి నటించిన ఊప్స్! అబ్ క్యా వెబ్ సిరీస్ జనవరి 20వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మెడికల్ చెకప్ సమయంలో జరిగే అనుకోని ఘటనతో ఓ అమ్మాయికి ఇబ్బందులు ఎదురవుతాయి. దీని చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం