మీ పిల్లలకు హాలిడేస్‌లో కచ్చితంగా చూపించాల్సిన మైథలాజికల్ యానిమేషన్ మూవీస్.. ఏ ఓటీటీలో చూడాలంటే..-animated indian mythological movies for kids on ott netflix prime video youtube zee5 jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మీ పిల్లలకు హాలిడేస్‌లో కచ్చితంగా చూపించాల్సిన మైథలాజికల్ యానిమేషన్ మూవీస్.. ఏ ఓటీటీలో చూడాలంటే..

మీ పిల్లలకు హాలిడేస్‌లో కచ్చితంగా చూపించాల్సిన మైథలాజికల్ యానిమేషన్ మూవీస్.. ఏ ఓటీటీలో చూడాలంటే..

Hari Prasad S HT Telugu

భారత పురాణ, ఇతిహాసాల ఆధారంగా యానిమేషన్ రూపంలో రూపొందిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటి? వాటిని ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.

మీ పిల్లలకు హాలిడేస్‌లో కచ్చితంగా చూపించాల్సిన మైథలాజికల్ యానిమేషన్ మూవీస్.. ఏ ఓటీటీలో చూడాలంటే..

ఓటీటీలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పిల్లలకు సంబంధించిన కంటెంట్ కూడా చాలానే ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకు భారత పురాణ, ఇతిహాసాల గురించి చెప్పాలని మీరు అనుకుంటే.. ఇప్పుడు చెప్పబోయే యానిమేటెడ్ సినిమాలను చూపించండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియ్, జియోహాట్‌స్టార్, యూట్యూబ్‌లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు.

1.బాల్ గణేష్ - ప్రైమ్ వీడియో

పిల్లలకు ఎంతో ఇష్టమైన దేవుడు గణపతి. అలాంటి దేవుడి మహిహలు, ఆయన చేసిన అడ్వెంచర్లను యానిమేషన్ రూపంలో తీసుకొచ్చిన మూవీ బాల్ గణేష్. దీనిని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. జియోహాట్‌స్టార్ లోనూ అందుబాటులో ఉంది.

2. మహాభారత్ (2013) - జియోహాట్‌స్టార్

మన దేశానికి చెందిన మరో గొప్ప ఇతిహాసం మహాభారతం. దీనిని 2013లో మహాభారత్ పేరుతో ఓ యానిమేటెడ్ సినిమా రూపంలో తీసుకొచ్చారు. దీనిని జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు. ఇందులోనే మహాభారత్ ఒరిజినల్ టీవీ సిరీస్ కూడా అందుబాటులో ఉంది.

3. రామాయణ: ది ఎపిక్ - యూట్యూబ్

రాముడి కథను ఎన్నిసార్లు విన్నా, చూసినా బోర్ కొట్టదు. అందుకే రామాయణాన్ని కొన్ని దశాబ్దాలుగా వివిధ రూపాల్లో తెరకెక్కిస్తూనే ఉన్నారు. రామాయణ: ది ఎపిక్ యానిమేషన్ రూపంలో వచ్చిన సినిమా. దీనిని యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.

4. హనుమాన్ - యూట్యూబ్

హనుమాన్ పుట్టుక నుంచి ఆయన జీవితం మొత్తాన్ని చూపించే యానిమేటెడ్ మూవీ హనుమాన్. 2005లో వచ్చింది. ముఖేష్ ఖన్నా తన వాయిస్ లో హనుమాన్ జీవితాన్ని కళ్లకు కట్టాడు. దీనిని యూట్యూబ్ లో చూడొచ్చు.

5. కృష్ణ ది బర్త్ - ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీ

చిన్ని కృష్ణుడి లీలలు ఈ కృష్ణ ది బర్త్ యానిమేటెడ్ మూవీలో చూపించారు. ఇది ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉంది. 2006లో వచ్చిన సినిమా ఇది.

6. ది లెెజెండ్ ఆఫ్ బుద్ధా - ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్

బుద్దుడి జీవితం గురించి రూపొందించిన యానిమేషన్ మూవీ ది లెజెండ్ ఆఫ్ బుద్దా. ఈ సినిమాను ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ లలో చూడొచ్చు. 77వ అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ యానిమేటెడ్ మూవీ కేటగిరీలో ఈ సినిమాను పంపించినా.. నామినేట్ కాలేకపోయింది.

7. సన్స్ ఆఫ్ రామ్ - ప్రైమ్ వీడియో

సన్స్ ఆఫ్ రామ్ యానిమేషన్ మూవీని లవకుశుల జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

8. అర్జున్ ది వారియర్ ప్రిన్స్ - నెట్‌ఫ్లిక్స్

మహాభారతంలోని కీలకపాత్ర అయిన అర్జునుడి ఆధారంగా రూపొందించిన యానిమేషన్ మూవీ ఇది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్ లోనూ ఈ సినిమాను చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం