Animal Day 2 WW Collections: యానిమల్ కలెక్షన్ల తుఫాన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే!-animal worldwide box office collections day 2 ranbir kapoor movie cross 200 crores gross mark ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Day 2 Ww Collections: యానిమల్ కలెక్షన్ల తుఫాన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే!

Animal Day 2 WW Collections: యానిమల్ కలెక్షన్ల తుఫాన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 03, 2023 03:02 PM IST

Animal Day 2 WW Collections: బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా దూకుడు మరింత పెరిగింది. భారీ కలెక్షన్లను సాధించింది. రెండు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూళ్లు రాబట్టిందంటే!

Animal Day 2 WW Collections: యానిమల్ కలెక్షన్ల తుఫాన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
Animal Day 2 WW Collections: యానిమల్ కలెక్షన్ల తుఫాన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే!

Animal Day 2 WW Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రెండో రోజు మరింత జోరు పెంచి.. భారీ కలెక్షన్లను దక్కించుకుంది. బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ సినిమా శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజ్ కాగా.. రెండు రోజుల్లో వసూళ్లలో దూకుడు చూపింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. యానిమల్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాలివే..

యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో సుమారు రూ.236కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ దాటి సత్తాచాటింది. రణ్‍బీర్ కెరీర్లోనే బెగ్గెస్ట్ హిట్‍ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. యానిమల్ రెండు రోజుల కలెక్షన్లపై మూవీ యూనిట్ అధికారంగా వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా తొలి రోజు రూ.116కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే.. శనివారం రెండో రోజు మరింత జోరు పెంచి రూ.120కోట్లను దక్కించుకుంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటం బాగా కలిసి వచ్చింది.

ఇక, ఇండియాలోనే యానిమల్ సినిమాకు రెండో రోజు రూ.66కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం. దీంతో రెండు రోజుల్లోనే ఇండియాలో ఈ చిత్రానికి సుమారు రూ.130కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. రెండో రోజే ఇండియాలో రూ.100కోట్ల నెట్ మార్కును దాటిన బాలీవుడ్ చిత్రంగా పఠాన్, జవాన్ సరసన యానిమల్ చేరింది. మూడో రోజైన ఆదివారం ఈ మూవీ కలెక్షన్లను మరింత ఎక్కువగా వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇక, తెలుగులోనూ యానిమల్ మంచి కలెక్షన్లను సాధిస్తోంది.

యానిమల్ సినిమాలో రణ్‍బీర్ యాక్టింగ్‍పై ప్రశంసలు వస్తున్నాయి. యాక్షన్ మోడ్‍లో, ఎమోషన్ సీన్లలో రణ్‍బీర్ నటనకు ప్రేక్షకులు జై కొడుతున్నారు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఎమోషన్ సీన్లలో మెప్పించారు. అనిల్ కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా, రణ్‍బీర్, తృప్తి మధ్య కెమెస్ట్రీ కూడా బాగా కుదిరిందని కూడా టాక్ వస్తోంది.

తండ్రిని కాపాడుకునేందుకు ఏమైనా చేసే కుమారుడి పాత్రను ఈ చిత్రంలో పోషించారు రణ్‍బీర్ కపూర్. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా.. భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.