Animal Twitter Review: యానిమ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌ట‌ విశ్వ‌రూపం - మాస్టర్ క్లాస్ మూవీ-animal twitter review overseas premiere talk ranbir kapoor rashmika mandanna movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Twitter Review: యానిమ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌ట‌ విశ్వ‌రూపం - మాస్టర్ క్లాస్ మూవీ

Animal Twitter Review: యానిమ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌ట‌ విశ్వ‌రూపం - మాస్టర్ క్లాస్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Dec 01, 2023 05:54 AM IST

Animal Twitter Review: ర‌ణ్‌బీర్‌క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యానిమ‌ల్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది.

యానిమ‌ల్ మూవీ
యానిమ‌ల్ మూవీ

Animal Twitter Review: ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన యానిమ‌ల్ మూవీ ఈ శుక్ర‌వారం (నేడు) వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజైంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

తండ్రీ కొడుకుల‌ అనుబంధం నేప‌థ్యంలో యాక్ష‌న్ క‌థాంశంతో సందీప్ వంగా రూపొందించిన ఈ సినిమాలో అనిల్‌క‌పూర్‌, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. యానిమ‌ల్ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

యానిమ‌ల్ మూవీలో తండ్రీ కొడుకుల బంధాన్ని కొత్త కోణంలో ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి చూపించాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. మ‌న‌షుల్లో అంత‌ర్లీనంగా దాగివున్న జంతుప్ర‌వృత్తిని, హింసాత్మ‌క మ‌న‌స్త‌త్వాన్నిడిఫ‌రెంట్‌గా చూపించిన సినిమా ఇద‌ని అంటున్నారు. రెగ్యుల‌ర్ స్టీరియోటైప్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా కొత్త ఫీల్‌ను యానిమ‌ల్ అందిస్తుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

మాస్ట‌ర్ క్లాస్‌...

బాలీవుడ్‌లో మాస్ట‌ర్ క్లాస్ మూవీగా యానిమ‌ల్ నిలుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతోన్నారు. సినిమాలో వ‌యెలెన్స్ ఎక్కువే అయినా ఆ సీన్స్‌ను క‌న్వీన్సింగ్‌గా ద‌ర్శ‌కుడు చూపించాడ‌ని చెబుతున్నారు. యానిమ‌ల్ ర‌న్‌టైమ్ మూడు గంట‌ల పైనే అయినా బోర్ అనే ఫీలింగ్ ఎక్క‌డ క‌ల‌గ‌కుండా ఎంగేజింగ్‌గా ద‌ర్శ‌కుడు సందీప్ వంగా సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు.

ర‌ణ్‌బీర్ కెరీర్‌లో బెస్ట్‌...

ర‌ణ్‌బీర్ క‌పూర్ వ‌న్‌మెన్ షోగా యానిమ‌ల్ నిలుస్తుంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. అత‌డి ప‌ర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంద‌ని, ర‌ణ్‌బీర్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్‌, ఫైనెస్ట్ మూవీగా యానిమ‌ల్ నిలుస్తుంద‌ని అంటున్నారు.

విల‌న్‌గా బాడీడియోల్ త‌న బాడీ లాంగ్వేజ్‌తో భ‌య‌పెట్టాడ‌ని అంటున్నారు. ర‌ణ్‌బీర్‌, బాబీడియోల్ పాత్ర‌లు పోటాపోటీగా సాగుతాయ‌ని చెబుతున్నారు. ర‌ష్మిక మంద‌న్న యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. క‌లెక్ష‌న్స్ ప‌రంగా యానిమ‌ల్ రికార్డులు బ్రేక్ చేయ‌డం ప‌క్కా అని చెబుతోన్నారు.

Whats_app_banner