Animal Run Time: యానిమల్ మూవీకి “ఎ” సర్టిఫికెట్.. రన్‌టైమ్ చూస్తే షాకవ్వాల్సిందే
Animal Run Time: యానిమల్ మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఇక ఈ సినిమా రన్ టైమ్ భారీగా ఉండటం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. రణ్‌బీర్, రష్మిక జంటగా ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
Animal Run Time: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలతో కలిసి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమా యానిమల్ (Animal). డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు డైరెక్టర్ సందీప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
అంతేకాదు ఈ యానిమల్ మూవీ రన్ టైమ్ ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్లు కావడం గమనార్హం. ఇంత భారీ రన్ టైమ్ ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి సందీప్ రెడ్డి తొలి సినిమా అర్జున్ రెడ్డి కూడా మూడు గంటలకుపైగానే ఉంది. ఇప్పుడు యానిమల్ సినిమా నిడివి మరింత ఎక్కువగా ఉండటంతో అసలు ఇందులో అంతగా ఏం ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.
వయోలెన్స్, సెక్సువల్ కంటెంట్ కారణంగా సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సీబీఎఫ్‌సీ. హిందీలో జోధా అక్బర్ (3 గంటల 34 నిమిషాల) తర్వాత ఆ స్థాయి నిడివి ఉన్న సినిమా ఈ యానిమల్ కావడం విశేషం. రణ్‌బీర్, రష్మికలాంటి క్రేజీ కాంబినేషన్ తోపాటు ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్, సింగిల్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి.
అర్జున్ రెడ్డిలాగే ఈ సినిమాలోనూ మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండబోతున్నట్లు ఇప్పటి వరకూ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్, రష్మికతోపాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించాడు. యానిమల్ మూవీని టీసిరీస్, సందీప్ కు చెందిన భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.