Ranbir Kapoor Remuneration: యానిమల్ సినిమాకు రణ్‍బీర్ కపూర్, రష్మిక ఎన్ని కోట్లు తీసుకున్నారంటే!
Ranbir Kapoor Remuneration - Animal Movie: యానిమల్ సినిమా కోసం ప్రధాన నటీనటులు పొందిన రెమ్యూనరేషన్ వివరాలు బయటికి వచ్చాయి. హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాకు ఎంత తీసుకున్నారో ఇక్కడ చూడండి.
Ranbir Kapoor Remuneration - Animal Movie: బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ కెరీర్లోనే భారీ హిట్ దిశగా యానిమల్ సినిమా దూసుకుపోతోంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రెండో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది. వసూళ్లలో ఇంకా దూకుడు కనబరుస్తోంది. యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. కాగా, యానిమల్ సినిమా కోసం ప్రధాన నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ల వివరాలు ఆన్‍లైన్‍లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలివే..
యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్, ఎమోషనల్ సీన్లు బాగా పండాయి. కాగా, యానిమల్ సినిమా కోసం హీరో రణ్‍బీర్ కపూర్ సుమారు రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. సాధారణంగా రణ్‍బీర్ రెమ్యూనరేషన్ ఎక్కువే అయినా.. యానిమల్ మూవీని క్వాలిటీతో తెరకెక్కించేందుకు ఆయన తన రెమ్యూనరేషన్‍ను తగ్గించుకున్నారట. అయితే, ఈ సినిమా లాభాల్లో రణ్‍బీర్‌కు వాటా దక్కనుందని సమాచారం.
యానిమల్ చిత్రంలో హీరోయిన్‍గా నటించిన రష్మిక మందన్న సుమారు రూ.4కోట్లను రెమ్యూనరేషన్‍గా అందుకున్నారని రిపోర్టులు వచ్చాయి. విలన్‍గా నటించిన బాబీ డియోల్ రూ.5కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక ఈ మూవీలో రణ్‍బీర్ తండ్రి పాత్రలో చేసిన సీనియర్ నటుడు అనిల్ కపూర్ రూ.2కోట్లు అందుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.
తండ్రీకొడుకుల సెంటిమెంట్‍తో యాక్షన్ ఎమోషన్ థ్రిల్లర్‌గా యానిమల్ చిత్రం రూపొందింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ వైలెంట్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.236కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది.
యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ కేతానీ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. ఏకంగా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రం కోసం పని చేశారు. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
సంబంధిత కథనం