Animal Movie Day 1 Collections: పఠాన్‍ను దాటేసిన యానిమల్.. తొలి రోజు బంపర్ కలెక్షన్లు
Animal Movie Day 1 Collections: యానిమల్ సినిమా బంపర్ ఓపెనింగ్ అందుకుంది. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజు భారీ కలెక్షన్లను సాధించింది.
Animal Movie Day 1 Collections: బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‍లో వచ్చిన యానిమల్ మూవీకి భారీ ఓపెనింగ్ దక్కింది. అంచనాలకు మించి తొలి రోజు ఈ మూవీ వసూళ్లను రాబట్టింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వైలెంట్‍గా ఈ యానిమల్ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ట్రైలర్‌తో ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు యానిమల్ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి.
యానిమల్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ కూడా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్ల విషయంలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రాన్ని యానిమల్ దాటేసింది. పఠాన్‍కు తొలి రోజు సుమారు రూ.106కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాగా.. యానిమల్ రూ.116కోట్లను రాబట్టింది. రణ్‍బీర్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉంది.
హాలీడేస్ లేని రోజు రిలీజై, స్టార్ యాక్టర్ల క్యామియోలు లేకుండా, ఏ సర్టికేట్‍తో యానిమల్ సినిమా ఈ రేంజ్‍లో కలెక్షన్లు సాధించింది. తొలి రోజు వసూళ్ల విషయంలో గదర్ 2ను కూడా యానిమల్ దాటేసింది. ఈ ఏడాది జవాన్ తర్వాత తొలి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్న బాలీవుడ్ సినిమాగా యానిమల్ నిలిచింది.
హిందీ సినిమా ఇండస్ట్రీలో నాన్-హాలీడ్ బెగ్గెస్ట్ ఓపెనింగ్ యానిమల్ చిత్రమేనని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా ట్వీట్ చేసింది. యానిమల్ సినిమాకు హిందీతో పాటు తెలుగులోనూ బంపర్ కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజు ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రానికి రూ.54.75 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్కలు వెల్లడయ్యాయి. యానిమల్ సినిమాకు టాక్ మిశ్రమంగా వచ్చినా కలెక్షన్లలో మాత్రం జోరు చూపింది. రణ్‍బీర్ యాక్షన్‍కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
యానిమల్ మూవీలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.
సంబంధిత కథనం