Animal 1st Week Collections: కొనసాగుతున్న యానిమల్ కలెక్షన్ల వేట.. ఏడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
Animal 1st Week Collections: యానిమల్ మూవీ కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ వివరాలు ఇవే.
Animal 1st Week Collections: బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా కలెక్షన్ల వేట కొనసాగుతోంది. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీపై ఓ వైపు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు హింస, బోల్డ్ ఎక్కువయ్యాయంటూ అదేస్థాయిలో కొందరి నుంచి విమర్శలు వస్తున్నాయి. మిక్డ్స్ టాక్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం యానిమల్ చిత్రానికి కలెక్షన్ల వర్షం కొనసాగుతోంది.
యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలివారం (7రోజుల్లో) ఏకంగా రూ.563 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. రణ్‍బీర్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‍గా దూసుకుపోతోంది. అలాగే, ఈ వీకెండ్ కూడా వసూళ్లు పుంజుకుంటాయన్న అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్‍లో ఈ వారం పెద్ద చిత్రాల రిలీజ్‍లు లేకపోవటంతో యానిమల్ జోరు చూపిస్తుందని మార్కెట్ పండితులు లెక్కలు కడుతున్నారు.
యానిమల్ సినిమాకు తొలి రోజు రూ.116 కోట్లు.. ఆ తర్వాత రూ.120 కోట్లు, మూడో రోజు సుమారు రూ.120కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో తొలి మూడు రోజుల్లోనే రూ.330కోట్లకుపైగా ప్రపంచవ్యాప్త కలెక్షన్లతో ఈ సినిమా అదరగొట్టింది. ఆ తర్వాత వీక్ డేస్‍లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్‍లో ఎంత మేర కలెక్షన్లు వస్తాయో చూడాలి.
ఇండియాలో ఇలా..
యానిమల్ సినిమాకు ఇండియాలోనే రూ.337.58కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. అన్ని భాషల వెర్షన్‍లకు కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఇండియాలో రూ.400కోట్ల మార్కును యానిమల్ దాటేసింది. మరోవైపు, తెలుగులోనూ యానిమల్ జోరు చూపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తయి.. బయ్యర్లు లాభాల్లోకి కూడా వచ్చేశారు.
అమెరికా, కెనడాల్లో యానిమల్ సినిమా కలెక్షన్లు 9 మిలియన్ డాలర్లను దాటింది. 10 మిలియన్ డాలర్ల వైపుగా వెళుతోంది. ఓవర్సీస్‍లోనూ చాలా చోట్ల యానిమల్ రికార్డులను క్రియేట్ చేస్తోంది.
యానిమల్ సినిమాపై విమర్శలు సైతం వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రజ్నీత్ రాజన్.. ఏకంగా రాజ్యసభ వేదికగా ఈ మూవీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హింసను ప్రేరేపించేలా ఉందని అన్నారు. మరికొందరు కూడా అభ్యంతరాలు వక్తం చేస్తున్నారు.
యానిమల్ సినిమాలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి కీలకపాత్రలు చేశారు. తండ్రీకొడుకుల బంధంతో వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా యానిమల్‍ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించారు.