Anil Ravipudi Remuneration: వరుసగా 8 హిట్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్!-anil ravipudi hikes his remuneration after sankranthiki vasthunam became a blockbuster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Ravipudi Remuneration: వరుసగా 8 హిట్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్!

Anil Ravipudi Remuneration: వరుసగా 8 హిట్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్!

Hari Prasad S HT Telugu
Jan 29, 2025 09:43 PM IST

Anil Ravipudi Remuneration: సంక్రాంతికి వస్తున్నాం మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దూకుడు మామూలుగా లేదు. వరుసగా 8 హిట్స్ అందించిన అతడు.. తాజాగా సంక్రాంతి హిట్ తర్వాత తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

వరుసగా 8 హిట్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్!
వరుసగా 8 హిట్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్!

Anil Ravipudi Remuneration: అనిల్ రావిపూడి.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో డిమాండ్ ఉన్న డైరెక్టర్. ఒకటీ రెండూ కాదు కెరీర్లో వరుసగా 8 హిట్స్ కొట్టిన అతడు.. సహజంగానే ఇప్పుడు ఎంతో మంది నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. దీంతో తన డిమాండ్ కు తగినట్లే అతడు తన రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత తన నెక్ట్స్ మూవీ కోసం అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

yearly horoscope entry point

అనిల్ రావిపూడి రెమ్యునరేషన్

సంక్రాంతికి వచ్చి మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నా మూవీ ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తోంది. దీంతో ఈ డైరెక్టర్ కు టాలీవుడ్ లో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. తన నెక్ట్స్ మూవీకి అతడు ఏకంగా రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇది మామూలు విషయం కాదు. రాజమౌళి, సుకుమార్ లాంటి డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లుగా ఉన్నారు. అనిల్ రావిపూడి కూడా క్రమంగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం హిట్‌తో..

నిజానికి సంక్రాంతికి వస్తున్నాం మూవీకే డైరెక్టర్ అనిల్ రావిపూడి భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇందులో లీడ్ రోల్లో నటించిన వెంకటేశ్ కంటే ఎక్కువగా డైరెక్టర్ కే రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలిసింది. వెంకటేశ్ రూ.10 కోట్లు తీసుకోగా.. అనిల్ మాత్రం రూ.15 కోట్లు అందుకోవడం విశేషం.

ఇక ఇప్పుడు తన నెక్ట్స్ మూవీకి అతడు ఈ రెమ్యునరేషన్ ను రూ.25 కోట్లకు పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతడు తన తర్వాతి సినిమాను చిరంజీవితో చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం కథ, ఇతర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ కోసం అనిల్ ఎలాంటి స్టోరీ సిద్ధం చేస్తాడన్నది ఆసక్తికరం.

అనిల్ రావిపూడి.. పట్టిందల్లా బంగారమే

తన మార్క్ కామెడీతో టాలీవుడ్ లో క్రమంగా ఎదుగుతున్నాడు అనిల్ రావిపూడి. అతడు టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా 2015లో అడుగుపెట్టాడు. ఆ ఏడాది పటాస్ మూవీ తీశాడు. అంతకుముందే 2008లో రైటర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసినా.. డైరెక్టర్ గా పటాసే అనిల్ కు తొలి సినిమా.

ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఇక ఆ మరుసటి ఏడాది సుప్రీం తీశాడు. 2017లో రవితేజతో రాజా ది గ్రేట్, 2019లో వెంకటేశ్, వరుణ్ లతో ఎఫ్2, 2020లో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, 2022లో ఎఫ్3, 2023లో భగవంత్ కేసరి, 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నవే.

Whats_app_banner

సంబంధిత కథనం