Sarangadariya Movie: రాజా రవీంద్ర సారంగదరియా మూవీలో లెజెండరీ సింగర్ చిత్ర పాట - అందుకోవా సాంగ్ లిరిక్స్ ఇవిగో!
Sarangadariya Movie: రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో నటిస్తోన్న తెలుగు మూవీ సారంగదరియాలో లెజెండర్ సింగర్ కేఎస్ చిత్ర ఓ పాట పాడింది. ఈ ఇన్‌స్పిరేషనల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్‌లో ఒకటిగా కొనసాగుతోంది.
Sarangadariya Movie: సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈసినిమాకు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లెజెండరీ సింగర్ కేఎస్ చిత్ర ఓ పాట పాడారు. అందుకోవా అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాట యూట్యూబ్‌లో తెలుగు ట్రెండింగ్స్ సాంగ్స్‌లో ఒకటిగా ఉంది.
నవీన్ చంద్ర చేతుల మీదుగా...
ఈ సాంగ్ హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా పాట విడుదలైంది. సారంగదరియా సినిమాకు ఎం. ఎబెనెజర్ పాల్ సంగీతం అందించాడు. ఇన్‌స్పిరేషనల్ సాంగ్ గా లిరిసిస్ట్ రాంబాబు గోసాల ఈ పాటను రాశారు. ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా ఈ పాటలోని సాహిత్యం సాగింది. పాటకు చిత్ర వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు చిత్ర.
మిడిలి క్లాస్ ఎమోషన్స్‌తో...
సారంగదరియా మూవీ తో అబ్బిశెట్టి (పండు) దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాను. సారంగదరియా మధ్యతరగతి కుటుంబం బంధాలు, అనుబంధాల్ని సహజంగా చూపించే మూవీ అని డైరెక్టర్ తెలిపాడు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కామెడీ, సెంటిమెంట్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అన్నాడు. చిత్ర పాడిన అందుకోవా పాట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని డైరెక్టర్ చెప్పాడు.
త్వరలో రిలీజ్
. ప్రస్తుతం సారంగదరియా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. సారంగదరియా సినిమాలో రాజా రవీంద్రతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మూడు వందల సినిమాలు...
చిరంజీవి యముడికి మొగుడు సినిమాలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజా రవీంద్ర హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూడు వందలకుపైగా సినిమాలు చేశాడు. తమిళంలో యాభై వరకు సినిమాల్లో నటించాడు. తెలుగులో ఎఫ్ఐఆర్, జానకి కలగనలేదుతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించాడు. ప్రస్తుతం నిఖిల్, రాజ్ తరుణ్‌తో పాటు పాటు మరికొంత మంది టాలీవుడ్ యంగ్ హీరోలకు మేనేజర్‌గా రాజా రవీంద్ర కొనసాగుతోన్నాడు.
పొన్నియన్ సెల్వన్ మాత్రమే...
యంగ్ సింగర్స్ జోరుతో చిత్ర కూడా తెలుగులో పాటలు పాడటం తగ్గించింది. గత ఏడాది పొన్నియన్ సెల్వన్‌లో ఓ పాట పాడింది చిత్ర. చాలా రోజుల తర్వాత సారంగదరియా అందుకోవా పాటతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
సాంగ్ లిరిక్స్….
అందుకోవా ఆకాశం అదిగో
అంతసులువా అనుకుంటే అవదే
పొందలేవా అవకాశం ఇదిగో
కూలబడుతూ కూర్చుంటే కాదే
కంటిపాప దాచే రంగురంగు కలలనే
కాలమాపగదా నిజముగ మార్చు మార్గం దొరికితే
గుండెలోన ఎగసే ఆటుపోటు అలలనే
ఊరడించలేవా సహనం తోడుంటే
సీతాకోకచిలకగ మారి
ఆశలరెక్కలు చాచుకుని
ఎగిరావంటే ఊహలలోకం ఎదురుగ నిలబడి
గెలుపిది అనదా
గగనం విడిచిన చినుకుగ జారి
ఆంక్షల సంకెల తెంచుకుని
దూకావంటే మొదలిక పయనం
కనివిని ఎరుగని చరిత అవదా
చరణం1:
ఈ అర్ధనారీశ్వరమున శివ లీలల్ని కనరే
ఈ వేళ మది ప్రణవ ప్రణయమున నర్తించి ఎగిరే
ఆ శివునినే తలచినా హృదయమిదిలే
శృతిలయలుగా సాగిన గీతమే మధురమవనీ
స్వరములుగ నా..లో రేగే ఆలాపనా..
సీతాకోకచిలకగ మారి
ఆశలరెక్కలు చాచుకుని
ఎగిరావంటే ఊహలలోకం ఎదురుగ నిలబడి
గెలుపిది అనదా
గగనం విడిచిన చినుకుగ జారి
ఆంక్షల సంకెల తెంచుకుని
దూకావంటే మొదలిక పయనం
కనివిని ఎరుగని చరిత అవదా
చరణం2:
నా మేనిలో సప్తసాగరపు సంగమము జరిగే
ఈ భ్రమర నాదాల జతిని గని లోకాలు వెలిగే
ఆ గంగనే శిరస్సు పై మోయు వాడే
తన సగముగా పార్వతీ దేవినే కలుపుకొనెనా
ఢమరుకమే నా..లో.. మోగే ప్రతీక్షణం
సీతాకోకచిలకగ మారి
ఆశలరెక్కలు చాచుకుని
ఎగిరావంటే ఊహలలోకం ఎదురుగ నిలబడి
గెలుపిది అనదా
గగనం విడిచిన చినుకుగ జారి
ఆంక్షల సంకెల తెంచుకుని
దూకావంటే మొదలిక పయనం
కనివిని ఎరుగని చరిత అవదా