Ram Charan: మా అందరికి రాజకుమారి దీపిక పిల్లి.. రామ్ చరణ్ ఇంటికి పిలిపించి మాట్లాడారు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్-anchor pradeep machiraju about ram charan deepika pilli mahesh babu in akkada ammayi ikkada abbayi pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: మా అందరికి రాజకుమారి దీపిక పిల్లి.. రామ్ చరణ్ ఇంటికి పిలిపించి మాట్లాడారు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్

Ram Charan: మా అందరికి రాజకుమారి దీపిక పిల్లి.. రామ్ చరణ్ ఇంటికి పిలిపించి మాట్లాడారు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Anchor Pradeep Machiraju About Ram Charan And Deepika Pilli: యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. రీసెంట్‌గా జరిగిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, దీపికా పిల్లిపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు కామెంట్స్ చేశాడు.

మా అందరికి రాజకుమారి దీపిక పిల్లి.. రామ్ చరణ్ ఇంటికి పిలిపించి మాట్లాడారు.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్

Anchor Pradeep Machiraju About Ram Charan And Deepika Pilli: టీవీ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు, యాంకర్ దీపికా పిల్లి జంటగా నటించిన సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ సినిమాకు నితిన్, భరత్ దర్శకత్వం వహించారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ దీపికా పిల్లి, ఇతర సినిమా టీమ్‌పై యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్ యు. మీ ద్వారా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మాకు ఎప్పుడూ ఆనందం. చాలా మంచి టీంతో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. రధన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. బాల్ రెడ్డి గారి విజువల్స్ చాలా వండర్‌ఫల్ ఉంటాయి" అని అన్నాడు.

చాలా గట్టిగా వినిపిస్తాయి

"మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మమెంట్‌, టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ ఈ సినిమాని వోన్ చేసుకుని సొంత సినిమాలా వర్క్ చేశారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాతో చాలామంది కొత్తవారు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ల పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి" అని ప్రదీప్ మాచిరాజు ఆశాభావం వ్యక్తం చేశాడు.

"నితిన్ భరత్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సరికొత్త స్టైల్‌ని స్క్రీన్‌పై చూపించబోతున్నారు. సందీప్ రాసిన కథ డైలాగ్స్ చాలా రీసౌండ్ చేస్తాయి. భరత్ నితిన్ ఈ సినిమా ద్వారా నాకు బ్రదర్స్‌లాగా దొరికారు. మా యూనిట్ మొత్తానికి రాజకుమారి దీపిక (హీరోయిన్ దీపికా పిల్లి). మేము కూడా తనని రాజకుమారిలాగే చూసుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది" అని యాంకర్ ప్రదీప్ తెలిపాడు.

మహేశ్ బాబుతో తొలి అడుగు

"సూపర్ స్టార్ మహేశ్ బాబు గారి సపోర్టుతో తొలి అడుగు వేసాం. ఆయన మా సాంగ్‌ని లాంచ్ చేయడం మాకెంతో బలాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ప్రదీప్ మాచిరాజు చెప్పుకొచ్చాడు.

"మా సినిమా మొట్టమొదటి టికెట్‌ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమా గురించి తెలుసుకుని ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఆ సపోర్ట్‌ని మేము మర్చిపోలేం. రామ్ చరణ్ గారు 'పెద్ది ఫర్ ప్రదీప్' అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగ్‌లో చాలా బిజీగా ఉంటూ కూడా మాకు సమయాన్ని కేటాయించి సపోర్ట్ చేసిన రామ్ చరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ప్రదీప్ అన్నాడు.

బ్యూటిఫుల్ మెమొరీ

"ఈ సినిమా ట్రైలర్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రామ్ చరణ్ గారు మా అందరితో సరదాగా ఇన్వాల్వ్ అవుతూ ఫస్ట్ టికెట్‌ని పర్చేజ్ చేయడం మాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఎంతో పెద్ద మనసుతో మాకు సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ సో మచ్. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మాకోసం ఒక్క రెండున్నర గంటలు స్పెండ్ చేయండి. సూపర్‌గా ఎంటర్టైన్ చేస్తాం. ఇది నా ప్రామిస్" అని యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెల్లడించాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం