Anasuya Ari Movie: రిలీజ్‌కు ముందే అనసూయ సైకో థ్రిల్లర్ మూవీ చూసే ఛాన్స్.. భగవద్గీతలోని సారాన్ని చెప్పే అరి!
Anasuya Ari Movie Offer To Watch Before Release: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన అరి మూవీ టీమ్ డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేపట్టింది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అరి మూవీని చూసే బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు డైరెక్టర్ జయ శంకర్ వాట్సాప్ నెంబర్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

Anasuya Ari Movie Offer To Watch Before Release: యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న అనసూయ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల పుష్ప 2 సినిమాతో అలరించిన అనసూయ రజాకార్ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అనసూయ నటించిన లేటెస్ట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అరి. ఈ సినిమాకు పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయ శంకర్ దర్శకత్వం వహించారు.
సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్న జయ శంకర్ డైరెక్టర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అరి సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ప్రస్తుతం అరి సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీమ్ బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ఇప్టపటికే ప్రత్యేకంగా ప్రదర్శించారు.
మాజీ ఉపరాష్ట్రపతితో సహా
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు అరి మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు. భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారు అని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్ చెబుతున్నారు. అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడేస్తున్నారు.
థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఆఫర్
ఇక అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్రయూనిట్. అది కూడా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు. మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా విడుదలకు ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
వాట్సాప్ నెంబర్ కూడా పెట్టి
ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు. కానీ, అరి మీదున్న నమ్మకంతో దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు.
విభిన్నంగా ప్రమోషన్స్
విభిన్నంగా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నంగా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు అనేది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు అరి మూవీ టీమ్ కూడా ఇలానే డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కి ముందే అరి సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ విడుదల చేశారు.
అరి నటీనటులు
పేపర్ బాయ్‌తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ అరి మూవీతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే, అరి చిత్రంలో అనసూయతోపాటు సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం నటించింది. ఇకపోతే అరి డైరెక్టర్ జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫమ్ అయింది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో
ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న డైరెక్టర్ జయ శంకర్ మూడో చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.
సంబంధిత కథనం