Razakar OTT: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ రజాకార్ మూవీ - ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే?
Razakar OTT: థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన రజాకార్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనసూయ, బాబీసింహా, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు.
Razakar OTT: బాబీసింహా, వేదిక, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన రజాకార్ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. స్వాతంత్య్రానికి ముందు నిజాం ప్రభువు అండగా తెలంగాణలో రజాకార్లు సాగించిన హింసకాండను ఆవిష్కరిస్తూ దర్శకుడు యాట సత్యనారాయణ రజాకార్ సినిమాను తెరకెక్కించాడు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నది.

ఓటీటీలోకి రజాకార్...
రజాకార్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26 లేదా మే 3న రజాకార్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
రజాకార్ కథ ఇదే...
దేశానికి స్వాతం త్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం ఇండియాలో విలీనం చేసేందుకు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒప్పుకోడు. నిజాం ప్రభువు అండగా రజాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైదరాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తుంటాడు.
మతమార్పిడులకు పాల్పడటంతో పాటు ఉర్దూ మాట్లాడని వారిని కఠినంగా శిక్షించారు. చాలా మందిని అంతమొందించారు. రజాకార్ల కుట్రలను కొంత మంది పోరాట యోధులు ఎలా ఎదురించి తమ ప్రాణాలను త్యాగం చేశారు? హైదరాబాద్‌ను భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా విలీనం చేశాడు? ఖాసీం రిజ్వీ జీవితం ఎలా ముగిసింది? అనే అంశాలతో రజాకర్ మూవీ తెరకెక్కింది.
తెలంగాణ విముక్తి పోరాటంలో...
తెలంగాణ విముక్తి పోరాటంలో వెలుగులోకి రాని పరకాల జెండా ఉద్యమం, భైరాన్ పల్లి నరమేథం లాంటి సంఘటలను ఈ సినిమాలో చూపించారు. తెలంగాణకు స్వేచ్ఛ కల్పించడం కోసం నారాయణరెడ్డి, ఐలమ్మ, రాజన్న వంటి వారు చేసిన అసమాన పోరాటాన్ని దర్శకుడు యాటా సత్యనారాయణ వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపించారు. \
మ్యూజిక్ ప్లస్...
రాజాకార్ మూవీలో ఇంద్రజ, ప్రేమ, అనుష్య త్రిపాఠి, మకరంద్ దేవ్‌పాండే, రాజ్ అర్జున్ ముఖ్య పాత్రలతో మెప్పించారు. అనసూయ, బాబీసింహా, రాజ్ అర్జున్, రాజ్ సఫ్రు తమ యాక్టింగ్‌తో మెప్పించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
మితిమీరిన హింస…
రజాకర్ మూవీకి బాగుందనే పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఓ వర్గం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ సినిమా సాగిందనే విమర్శలొచ్చాయి. మితిమీరిన హింసను సినిమాలో చూపించడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు పెద్దగా రజాకార్ సినిమాను చూడలేకపోయారు.
రజాకార్ మూవీతోనే దర్శకుడు యాటా సత్యనారాయణ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గూడురు సత్యనారాయణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మార్చి 15కు ముందు పలుమార్లు ఈ సినిమా వాయిదాపడింది. అనేక అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకొచ్చింది.
టాపిక్