Anasuya: జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా.. వైరల్‌ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ-anasuya posts a cryptic message and fans saying she quit jabardast show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anasuya Posts A Cryptic Message And Fans Saying She Quit Jabardast Show

Anasuya: జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా.. వైరల్‌ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 04:55 PM IST

Anasuya: అనసూయ.. తెలుగు వాళ్లందరికీ ఈ పేరు పరిచయం చేసేలా చేసిన టీవీ షో జబర్దస్త్‌. అప్పటి వరకూ ఓ న్యూస్‌ యాంకర్‌గా ఉన్న ఆమె కెరీర్‌ ఈ షో ద్వారా ఎక్కడికో వెళ్లిపోయింది.

అనసూయ
అనసూయ (Photo Credit: @itsme_anasuya)

జబర్దస్త్‌లాంటి కామెడీ షోకు గ్లామర్‌ మెరుగులు అద్దిన యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. ఈ షో ఎంత హిట్‌ అయిందో అంతకుమించిన పేరు అనసూయకు వచ్చింది. దాదాపు ఈ కామెడీ షో ప్రారంభమైనప్పటి నుంచీ ఆమె ఈ షోతోనే ఉంది. ఆమె కోసమే ఈ షోను ఫాలో అయ్యే అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి జబర్దస్త్‌ షోకి ఆమె గుడ్‌బై చెప్పిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మంగళవారం (జూన్‌ 28) తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆమె చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇందులో నేరుగా తాను జబర్దస్త్‌ షోను వదిలేస్తున్నట్లు అనసూయ చెప్పలేదు కానీ.. కెరీర్‌లో పెద్ద నిర్ణయం తీసుకున్నానని, దానిని ఇప్పటికే అమలు చేసినట్లు కూడా చెప్పింది. "నా కెరీర్‌లో పెద్ద నిర్ణయం తీసుకొని ఇవాళే అమలు చేశాను. నాతోపాటు ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను. అందులో చాలా మంచి జ్ఞాపకాలు, కొన్ని చెడు, మరికొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. మీరు నాతో పాటు ఉండి ఎప్పటిలాగే నన్ను ఇష్టపడతారని ఆశిస్తున్నాను" అన్నది అనసూయ పోస్ట్‌ సారాంశం.

ఇది చూసి ఆమె జబర్దస్త్‌ షోకి గుడ్‌బై చెప్పిందని అభిమానులు ఫిక్సయిపోయారు. ఆమెకు క్రమంగా సినిమా అవకాశాలు పెరుగుతుండటం, ఇతర ఛానెళ్ల నుంచి కూడా షోలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జబర్దస్త్‌ కంటే ముందు అనసూయ పేరు ఎవరికీ తెలియదు. అంతకుముందు సాక్షి టీవీలాంటి న్యూస్‌ ఛానెల్స్‌లో న్యూస్‌ రీడర్‌గా పని చేసింది. అయితే జబర్దస్త్‌ షో ద్వారా ప్రతి తెలుగు ఇంటికీ సుపరిచితమైన ఆమె.. క్రమంగా సినిమాల్లోనూ అవకాశాలు అందుకునే స్థాయికి చేరింది.

<p>అనసూయ పోస్ట్ ఇదే</p>
అనసూయ పోస్ట్ ఇదే (Instagram)
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్