Anasuya Next Movie: అనసూయ నెక్స్ట్ మూవీలో శ్రీకృష్ణుడి పాత్ర హైలైట్ అంట! - రిలీజ్ ఎప్పుడంటే?
Anasuya Next Movie: కల్కి తర్వాత కృష్ణ భగవానుడి పాత్రను టచ్ చేస్తూ తెలుగులో మరో డివోషనల్ సోషియో ఫాంటసీ మూవీ రాబోతోంది. అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోన్న అరిలో కృష్ణుడిపాత్ర ప్రధానంగా ఉంటుందని సమాచారం.
Anasuya Next Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లో డివోషనల్ కాన్సెప్ట్‌లకు డిమాండ్ పెరిగింది. డివోషషనల్ అంశాలతో రూపొందిన కల్కి, హనుమాన్, అఖండ, కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి. మహాభారతానికి కల్పిత అంశాలను జోడిస్తూ సూపర్ హీరో కథాంశంతో రూపొందిన కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు మూవీగా రికార్డ్ క్రియట్ చేసింది. అంతే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
40 కోట్ల బడ్జెట్ - 350 కోట్ల కలెక్షన్స్...
ఈ ఏడాది విడుదలైన హనుమాన్ కూడా నిర్మాతలకు పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 350 కోట్లకుపై కలెక్షన్స్ దక్కించుకున్నది. ఈ సక్సెస్‌లతో డివోషనల్ సోషియో ఫాంటసీ చిత్రాలతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపుతోన్నారు. దైవ భక్తిని చాటే ఎమోషన్, దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమనే నమ్మకం దర్శకనిర్మాతల్లో బలపడింది.
అనసూయ అరి కూడా...
దైవభక్తి కథలతో ప్రస్తుతం కల్కి 2, దేవకీనంద వాసుదేవ, జై హనుమాన్, కన్నప్పతో పాటు పలు టాలీవుడ్ మూవీస్ తెరకెక్కుతోన్నాయి. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన అరి కూడా ఈ లిస్ట్‌లో నిలవనున్నట్లు సమాచారం. కృష్ణుడి పాత్ర ప్రధానంగానే ఈ మూవీ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో పేపర్ బాయ్ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. ఈ మూవీలో క్లైమాక్స్‌లో కృష్ణుడి ప్రస్తావన ఉంటుందని, కృష్ణుడు కనిపించే ఆ సీన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని మేకర్స్ చెబుతోన్నారు.
అరిషడ్వర్గాలు...
అరిషడ్వర్గాలలోని కామము, క్రోధము, లోభం, మొహం, మదమాత్సర్యాలను ఒక్కోపాత్ర ద్వారా అరి మూవీలో డిఫరెంట్‌గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అనసూయతో పాటు సాయికుమార్, వినోద్ వర్మ, సూర్య, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మై నేమ్ ఈజ్ నో బడీ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
త్వరలోనే అరి మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. అరి మూవీని హిందీలో అభిషేక్ బచ్చన్, తమిళంలో శివకార్తికేయన్ తమ బ్యానర్స్ ద్వారా రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం అరి, పుష్ప 2తో పాటు తెలుగులో మరికొన్ని సినిమాలు చేస్తోంది అనసూయ.