Anasuya Look in Vimanam Movie: మరోసారి మాస్ పాత్రలో అనసూయ - వైరల్‌గా మారిన విమానం మూవీ పోస్టర్
Anasuya Look in Vimanam Movie: విమానం సినిమా నుంచి అనసూయ ఫస్ట్‌లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Anasuya Look in Vimanam Movie: మాస్ రోల్స్ అనసూయకు బాగా కలిసొచ్చాయి. రంగస్థలంలో రంగమ్మత్తతో పాటు పలు సినిమాల్లో అనసూయ చేసిన మాస్ పాత్రలు ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా మరోసారి మాస్ క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా విమానం. ఈ సినిమాలో అనసూయ ఫస్ట్‌లుక్‌ను మే డే సందర్భంగా సోమవారం రిలీజ్ చేశారు. చీరకట్టులో ముక్కుపుడక ధరించి గద్దెపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ అనసూయ కనిపిస్తోంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది.
ఈ సినిమాలోని సిన్నోడా ఓ సిన్నోడా అనే పాటను రిలీజ్ చేశారు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. ఈ పాటకు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తూ రాశారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రను పోషిస్తోన్నారు. ఈ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత మీరా జాస్మిన్ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.
రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. విమానంతో పాటు పుష్ప 2, అరి అనే సినిమాలు చేస్తోంది. తమిళంలో ఫ్లాష్‌బ్యాక్ అనే సినిమాలో నటిస్తోంది.
టాపిక్