Anasuya on Pushpa 2: ‘ప్రతీ 10 నిమిషాలకు..’: పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అనసూయ
Anasuya Bharadwaj on Pushpa 2: The Rule: పుష్ప 2 చిత్రంపై హైప్ ఓ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో అనసూయ భరద్వాజ్ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. బిగ్‍బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్‍కు గెస్టుగా వచ్చిన ఆమె పుష్ప 2 గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఇవే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాపై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రానికి హైప్ మరో రేంజ్‍లో ఉంది. డైరెక్టర్ సుకుమార్ ఈ యాక్షన్ మూవీని గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా మూడేళ్ల తర్వాత ఈ చిత్రం వస్తోంది. పుష్ప 2 చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ తరుణంలో పుష్ప 2 గురించి మరింత హైప్ పెంచారు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్.
పుష్ప 2 చిత్రంలో దాక్షాయనీ అనే మాస్ నెగెటివ్ రోల్ చేస్తున్నారు అనసూయ. తొలి భాగంలో మెప్పించిన ఆమె పుష్ప రెండో పార్ట్‌లోనూ కీలకపాత్ర పోషించారు. తాజాగా బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్‍కు అనసూయ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప 2 గురించి హోస్ట్ కింగ్ నాగార్జున అడగటంతో ఆమె కొన్ని విషయాలు చెప్పారు.
10 నిమిషాలకో హై
“ఇప్పుడేమో విలన్ అయ్యావ్, పుష్ప అని బెదిరిస్తున్నావ్. పుష్పకు సంబంధించిన కొన్ని..” అని అనసూయతో నాగార్జున అన్నారు. వెనుక ఉంటానంటే చెప్పేస్తానంటూ అనసూయ సరదాగా అన్నారు. తాను ఎక్కడికి వెళ్లానని నాగ్ అన్నారు. పుష్ప 2 సినిమాలో 10 నిమిషాలకు ఓ హై ఇచ్చే మూవ్‍మెంట్ ఉంటుందని అనసూయ తెలిపారు.
తొలి పార్ట్ కంటే పుష్ప 2: ది రూల్‍లో అసలు కథ ఉంటుందని అనసూయ తెలిపారు. “ప్రతీ 10 నిమిషాలకు ఓ హై ఉందని సినిమాలో ఉన్న నాకే అనిపిస్తోంది. 10 నిమిషాల తర్వాత క్లైమాక్స్‌లా ఉంది అదేంటి అనిపిస్తుంది.. కానీ లేదు. ఈ పార్ట్‌లో మరింత డెప్త్ ఉంటుంది. పుష్ప: ది రైజ్ దాదాపు ఇంట్రడక్షన్. అసలు కథ ఇప్పుడు ఉంటుంది” అని అనసూయ వెల్లడించారు.
పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. అతిత్వరలో చిత్రీకరణ పూర్తి కానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా పూర్తయి లాక్ అయింది. త్వరలోనే సెకండాఫ్ చిత్రీకరణ కూడా పూర్తి కానుంది.
దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్లు
పుష్ప 2 చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‍లో విపరీతమైన హైప్ ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లను చేసేందుకు పుష్ప 2 టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్టు టాక్. అలాగే, వివిధ రాష్ట్రాలకు మూవీ టీమ్ వెళ్లి ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్లను షురూ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
పుష్ప 2 ది రూల్ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, సునీల్, ప్రకాశ్ రాజ్, అనసూయ కీరోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి రికార్డుస్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 5న భారీస్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.