జనరేషన్ ఆల్ఫా మన సంస్కృతి, సాంప్రదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ నటి అనసూయ పెద్ద కొడుకు మాత్రం ఎంతో పద్ధతిగా ఉపనయనానికి సరే అన్నాడు. ఈ మధ్యే వేడుక కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. శౌర్య భరద్వాజ్ ను చూసి గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పింది.
నటి అనసూయ ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే ఆమె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనాథాశ్రమంలో తన బర్త్ డే జరుపుకుంది. ఇక ఇప్పుడు ఆమె పెద్ద కొడుకు శౌర్య భరద్వాజ్ ఉపనయనం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా చెబుతూ ఆ వీడియోను షేర్ చేసింది. “డియరెస్ట్ శౌర్య భరద్వాజ్. నా పెద్ద కొడుకు. నేనెప్పుడూ ఇంత గర్వపడలేదు.
దీనికోసం ఓ వేడుక ప్రత్యేకంగా అవసరం లేదని తెలుసు. ఎందుకంటే నువ్వెప్పుడూ నీతిగానే సాగుతున్నావు. కానీ నీ ఉపనయనంతో నీ తల్లిదండ్రులుగా, ఓ కుటుంబంగా ఓ ఆధ్యాత్మిక పునర్జన్మనెత్తాము.. దీని ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలన్న వాగ్దానం చేశాము.. మన ఆధ్యాత్మిక విలువలు, సూత్రాలు, జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు ఇలా అందిస్తున్నాం” అనే క్యాప్షన్ తో అనసూయ ఈ వీడియోను షేర్ చేసింది.
ఈ సందర్భంగా ఇలా ఓ సాంప్రదాయ వేడుకకు అంగీకరించిన తన కొడుకుకి ఆమె థ్యాంక్స్ చెప్పింది. “థ్యాంక్యూ మై డియరెస్ట్ బచ్చా.. నువ్వు జనరేషన్ ఆల్ఫా అయినా కూడా మన సాంప్రాదాయాలను కొనసాగించే వీలు మాకు కల్పించావు. ఐ లవ్యూ. ఎలాంటి సమయంలోనే అయినా ఆ హనుమంతుడి శక్తితో నిన్ను ఎప్పుడూ నీతిగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను” అని అనసూయ చెప్పింది.
ఉపనయనం అనేది ఒక ప్రాచీన హిందూ ఆచారం. ఇది వేదాధ్యయనానికి, ఆధ్యాత్మిక జీవితానికి, సమాజంలో గౌరవప్రతిష్టను అందుకోవడానికి ప్రారంభంగా భావిస్తారు. ఉపనయనాన్ని సాధారణంగా పిల్లల వయస్సు 7 నుండి 16 సంవత్సరాల మధ్య చేయడం ఉత్తమం. దీనికి కారణం, ఈ వయస్సులో పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా మారే దశ.
గురువు వద్ద నుండి పొందిన శిక్షణను సమర్థవంతంగా స్వీకరించగల పరిణతితో ఉంటారు. సాధారణంగా ఇది ఉత్తరాఖాండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రాంతాలలో ఎక్కువగా పాటించే ఆచారం. ఉపనయనం ఆచారం వేదాధ్యయనానికి సంబంధించినది. ఈ ఆచారం ప్రాథమిక ఉద్దేశం వేదాలు, మంత్రాలు, ధార్మిక విధానాలను నేర్చుకోవడం. ప్రత్యేకంగా, యజుర్వేదంలో ఉపనయనం గురించి వివరంగా చర్చించారు.
సంబంధిత కథనం