Anasuya Bharadwaj: మరో కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్.. రాయల్ లుక్‌లో అనసూయ.. చేతులు చూపిస్తూ ఫొటో!-anasuya bharadwaj look released from nagabandham sets and anchor anasuya plays an important role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya Bharadwaj: మరో కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్.. రాయల్ లుక్‌లో అనసూయ.. చేతులు చూపిస్తూ ఫొటో!

Anasuya Bharadwaj: మరో కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్.. రాయల్ లుక్‌లో అనసూయ.. చేతులు చూపిస్తూ ఫొటో!

Sanjiv Kumar HT Telugu

Anasuya Bharadwaj Nagabandham Look Released: యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న నాగబంధం నుంచి తాజాగా అనసూయ లుక్ రిలీజ్ అయింది. సినిమా సెట్స్ నుంచి షేర్ చేసిన ఈ ఫొటోలో అనసూయ కేవలం చేతులు మాత్రమే చూపించింది.

మరో కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్.. రాయల్ లుక్‌లో అనసూయ.. చేతులు చూపిస్తూ ఫొటో!

Anasuya Bharadwaj Nagabandham Look Released: యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌-ఇండియా మూవీ ‘నాగబంధం’. ప్యాషనేట్‌ ఫిల్మ్‌ మేకర్‌ అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన నాగబంధం ఫస్ట్‌ లుక్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది.

తెల్ల చీరలో అందంగా

నాగబంధం సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న యాంకర్ అనసూయ సెట్స్ నుంచి ఓ ఫోటో షేర్ చేశారు. రాయల్ లుక్‌లో కనిపిస్తున్న చేతులుని ప్రజెంట్ చేసే ఈ ఫోటో చాలా క్యురియాసిటీ పెంచింది. అలాగే తెల్ల చీరలో ఎంతో అందంగా కనిపించింది అనసూయ భరద్వాజ్.

ఎపిక్ అడ్వెంచర్‌గా

‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్‌ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్‌ నామా కథ, స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్‌ను తీసుకువస్తున్నారు. ఎన్ఐకే స్టూడియోస్‌ ఆధ్వర్యంలో కిషోర్‌ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్‌ నామా గర్వంగా సమర్పిస్తున్నారు.

నాగబంధం నటీనటులు

నాగబంధం సినిమాలో విరాట్‌ కర్ణ హీరోగా చేస్తుండగా.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, రిషభ్‌ సహానీ, జయప్రకాష్, జాన్‌ విజయ్‌, మురళీ శర్మ, అనసూయ, శరణ్య, ఈశ్వరిరావు, జాన్‌ కొక్కిన్‌, అంకిత్‌ కొయ్య, సోనియా సింగ్‌, మాథ్యూ వర్గీస్‌, జాసన్‌ షా, బి.ఎస్.అవినాష్, బేబి కియరా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది

పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ నాగబంధం ఒక పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ఉండనుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్‌ చేస్తున్నారు.

అత్యాధునిక వీఎఫ్ఎక్స్

ఈ చిత్రం అసాధారణమైన నిర్మాణ విలువలు, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ హై ఆక్టేన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కనుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి సౌందర్‌ రాజన్‌ ఎస్‌ డీవోపీగా పనిచేస్తున్నారు. అభే సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్ చక్రవర్తి డైలాగ్స్‌ రాయగా, ఆర్‌సీ ప్రణవ్‌ ఎడిటర్‌, అశోక్‌ కుమార్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, స్ట్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌ పనులను శ్రవణ్, రాజీవ్‌ ఎన్‌ కృష్ణ చూసుకున్నారు.

ఐదు భాషల్లో ఏక కాలంలో

ఇదిలా ఉంటే, నాగబంధం సినిమా ఈ ఏడాది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. అయితే, ఇంకా నాగబంధం రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించలేదు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం