Venkatesh Birthday: వెంక‌టేష్ హీరోగా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అన్ని రీమేక్‌లే!-anari to taqdeerwala victory venkatesh bollywood movies hits and flops ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh Birthday: వెంక‌టేష్ హీరోగా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అన్ని రీమేక్‌లే!

Venkatesh Birthday: వెంక‌టేష్ హీరోగా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అన్ని రీమేక్‌లే!

Nelki Naresh Kumar HT Telugu
Dec 13, 2024 12:37 PM IST

Venkatesh Birthday: హీరోగా 38 ఏళ్ల కెరీర్‌లో 76కుపైగా సినిమాలు చేశాడు విక్ట‌రీ వెంక‌టేష్‌. బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో న‌టించాడు. అనారి, త‌ఖ్‌దీర్‌వాలా సినిమాల్లో హీరోగా క‌నిపించాడు. గ‌త ఏడాది రిలీజైన స‌ల్మాన్‌ఖాన్ కిసి కా భాయ్ కిసి కి జాన్ లో కీల‌క పాత్ర‌లో వెంక‌టేష్ ద‌ర్శ‌న‌మిచ్చాడు.

వెంకటేష్ బర్త్ డే
వెంకటేష్ బర్త్ డే

Venkatesh Birthday: టాలీవుడ్ హీరోల్లో వెంక‌టేష్‌ది విల‌క్ష‌ణ‌మైన పంథా. కెరీర్ ఆరంభం నుంచిచ స్టార్‌డ‌మ్‌, ఇమేజ్ ప‌ట్టింపుల‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన క‌థాంశాల‌తో ఎంచుకుంటూ సినిమాలు చేస్తోన్నాడు. ఫ్యామిలీ ఎమోష‌న్స్, కామెడీ క‌ల‌బోసిన క‌థ‌ల‌తో ఎన్నో అద్భుత విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు వెంక‌టేష్. 2000 ద‌శ‌కంలో చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌తో పాటు టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్నాడు.

yearly horoscope entry point

హీరోగా 76 సినిమాలు...

38 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ఇప్ప‌టివ‌ర‌కు హీరోగా వెంక‌టేష్ 76కుపైగా సినిమాలు చేశాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో వెంక‌టేష్ మూడు సినిమాలు చేశాడు. అనారి, త‌ఖ్‌దీర్‌వాలా సినిమాల్లో హీరోగా న‌టించ‌గా.. స‌ల్మాన్ ఖాన్ కిసికా భాయ్ కిసి కీజాన్‌ మూవీలో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు . ఈ మూడు సినిమాలు రీమేక్‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

చంటి రీమేక్‌...

వెంక‌టేష్ హీరోగా తెలుగులో హిట్టైన చంటి మూవీ హిందీలో అనారి పేరుతో రీమైకైంది. ఈ రీమేక్‌తోనే హీరోగా వెంక‌టేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క‌రిష్మాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు కేముర‌ళీమోహ‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

1993లో రిలీజైన అనారి మూవీ ఆ ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవ‌లం కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో రూపొందిన అనారి మూవీ మూడు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. అనారి మూవీ బాలీవుడ్‌లో వెంక‌టేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

య‌మ‌లీల రీమేక్‌...

అనారి రిలీజైన రెండేళ్ల త‌ర్వాత హిందీలో త‌ఖ్‌దీర్‌వాలా మూవీ చేశాడు వెంక‌టేష్‌. తెలుగులో అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌మ‌లీల ఆధారంగా త‌ఖ్‌దీర్‌వాలా మూవీ రూపొందింది. తెలుగు వెర్ష‌న్‌తో పోలిస్తే హిందీలో చాలా మార్పులు చేస్తూ ద‌ర్శ‌కుడు ముర‌ళీమోహ‌న్‌రావు త‌ఖ్‌దీర్ వాలా సినిమాలో తెర‌కెక్కించారు.

ఈ సెంటిమెంట్ కామెడీ మూవీలో సూర‌జ్ పాత్ర‌లో వెంక‌టేష్ యాక్టింగ్‌కు బాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన త‌ఖ్‌దీర్‌వాలా మూవీ ఆరు కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు రెండింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టింది. త‌ఖ్‌దీర్ వాలా మూవీలో వెంక‌టేష్ స‌ర‌స‌న ర‌వీనా టాండ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

టాలీవుడ్‌పైనే ఫోక‌స్‌...

అనారి, త‌ఖ్‌దీర్ వాలా సినిమాల‌కు వెంక‌టేష్ తండ్రి డి రామానాయుడు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ రెండు సినిమాలు సూప‌ర్‌హిట్‌గా నిల‌వ‌డంతో బాలీవుడ్ నుంచి వెంక‌టేష్‌కు ప‌లు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ టాలీవుడ్ కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టిన వెంక‌టేష్ బాలీవుడ్‌లో సినిమాలు చేయ‌లేక‌పోయాడు.

స‌ల్మాన్ ఖాన్ మూవీలో...

దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత గ‌త ఏడాది రిలీజైన కిసీ కా భాయ్ కిసి కి జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు వెంక‌టేష్‌. స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ మూవీలో పూజా హెగ్డే సోద‌రుడి పాత్ర‌లో క‌నిపించాడు. త‌మిళ మూవీ వీర‌మ్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన కిసి కా భాయ్ కిసి కి జాన్ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

సంక్రాంతికి వ‌స్తున్నాం...

ప్ర‌స్తుతం వెంక‌టేష్ తెలుగులో సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా చేస్తోన్నాడు. క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య‌రాజేష్, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. దిల్‌రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

Whats_app_banner