OTT: నాలుగు నెలల తర్వాత మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్-ananya nagalla pottel to stream on sun nxt ott from friday 14th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: నాలుగు నెలల తర్వాత మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

OTT: నాలుగు నెలల తర్వాత మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

Hari Prasad S HT Telugu
Published Feb 13, 2025 07:53 PM IST

OTT: ఓటీటీలోకి ఓ తెలుగు రూరల్ డ్రామా థ్రిల్లర్ మూవీ నాలుగు నెలల తర్వాత వస్తోంది. అయితే ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు మూడో ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.

నాలుగు నెలల తర్వాత మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్
నాలుగు నెలల తర్వాత మూడో ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

OTT: కొన్ని సినిమాలు ఒకటి కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైకి రావడం ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిన్న సినిమాలు ఇలా రెండు, మూడు ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తున్నాయి. తాజాగా తెలుగు రూరల్ డ్రామా థ్రిల్లర్ మూవీ పొట్టేల్ కూడా ముచ్చటగా మూడో ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సన్ నెక్ట్స్ ఓటీటీలోకి పొట్టేల్

అనన్య నాగళ్ల నటించిన మూవీ పొట్టేల్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. డిసెంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ కూడా ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ఈ సినిమాను సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.

"చదువు కోసం ఓ తండ్రి చేసే పోరాటం.. న్యాయం కోసం పోరాటం, ఒక్కో పాఠం నేర్చుకుంటూ.. పొట్టేల్ రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో" అనే క్యాప్షన్ తో మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

పొట్టేల్ మూవీ గురించి..

పొట్టేల్ మూవీ గతేడాది అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైన పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయినా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేశాడు. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీని తీశారు. 1980ల కాలం నేపథ్యంలో.. ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.

పొట్టేల్ మూవీలో యువ చంద్ర కృష్ణ, అనన్యతో పాటు అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. సినిమాలో నటీనటుల నటనకు మంచి మార్కులే పడినా.. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రేక్షకులు నిరాశకు గురవడంతో పెద్దగా ఆడలేదు. పొట్టేల్ మూవీని ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్, నీసా ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై నిశాంక్ రెడ్డి, కృతి, సురేశ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం సుమారు రూ.2.5కోట్ల కలెక్షన్లు సాధించినట్టు అంచనాలు ఉన్నాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం