Ananya Nagalla: ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు ఈ రోల్ మరో ఎత్తు అంటున్నారు.. అనన్య నాగళ్ల కామెంట్స్
Ananya Nagalla About Srikakulam Sherlock Holmes: అనన్య నాగళ్ల నటించిన న్యూ కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో డిసెంబర్ 27న సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Ananya Nagalla Srikakulam Sherlock Holmes Success Meet: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో నటించిన న్యూ కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. ఈ సినిమాకు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు.
సక్సెస్‌ఫుల్‌గా రన్
లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాను వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ మూవీ అందరినీ అలరిస్తూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ డిసెంబర్ 27న శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
నా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్
ఈ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ అనన్య నాగళ్ల మాటాడుతూ.. "అందరికీ నమస్కారం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాతో పాటు నా పాత్రకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇందులో చేసిన రోల్ మరో ఎత్తనే రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పింది.
మన రూట్స్‌తో పాటు థ్రిల్
"కొత్త ప్రయత్నం చేస్తే తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైయింది. మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ ఇది. చుసిన ఆడియన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటున్నారు. మన రూట్స్‌తో పాటు థ్రిల్ ఇచ్చే సినిమా ఇది. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీస్‌తో కలసి సినిమా చూడండి. తప్పకుండా థ్రిల్ అవుతారు" అని హీరోయిన్ అనన్య నాగళ్ల తెలిపింది.
చివరి 40 నిమిషాలు
సినిమాను రిలీజ్ చేసిన వంశీ నందిపాటి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమాని సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఒక మంచి సినిమా తీశారు, మంచి ప్రయత్నం చేశారు అని ప్రేక్షకులు చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తుంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
ఎక్కువగా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్
"ఇందులో ఎంటర్‌టైన్మెంట్ కంటే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందని మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం. సినిమా చూసిన ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇందులో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందని చెప్పారు. మేము కూడా అదే ఊహించాము. ఈ శని, ఆదివారం కూడా ఈ సినిమాని ఇలానే సపోర్ట్ చేసి ఇంకా మంచి నెంబర్స్ మాకు ఇచ్చి ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో బయటికి వచ్చేలా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థాంక్యూ" అని వంశీ నందిపాటి తన స్పీచ్ ముగించారు.
తొలి ప్రయత్నంలోనే
"మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించానని అనుకుంటున్నాను. మేము ఊహించిన దాని కంటే రెస్పాన్స్ చాలా బెటర్‌గా ఉంది. ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నాను. థాంక్యూ" అని శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ నిర్మాత వెన్నెపూస రమణారెడ్డి అన్నారు.