OTT Crime Thriller: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
OTT Crime Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు ఆనంద్ శ్రీబాల. గతేడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
OTT Crime Thriller: మలయాళం ఇండస్ట్రీలో నుంచి వచ్చే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంటుంది. అలా తాజాగా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా వచ్చింది. ఈ సినిమా పేరు ఆనంద్ శ్రీబాల. ప్రముఖ మలయాళ నటుడు అర్జున్ అశోకన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఆనంద్ శ్రీబాల ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆనంద్ శ్రీబాల గతేడాది నవంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర యావరేట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ మూవీ శనివారం (జనవరి 18) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ సినిమా కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులోకి రానుంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడాలనుకుంటే.. ఈ మనోరమ మ్యాక్స్ లోకి వెళ్లి చూడొచ్చు.
ఆనంద్ శ్రీబాల మూవీ ఎలా ఉందంటే?
ఆనంద్ శ్రీబాల మూవీ ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. గతేడాది నవంబర్ 15న థియేటర్లో రిలీజైంది. విష్ణు వినయ్ మూవీని డైరెక్ట్ చేశాడు. దర్శకుడిగా అతనికిదే తొలి సినిమా. ఇందులో అర్జున్ అశోకన్ లీడ్ రోల్లో నటించాడు. అతనితోపాటు సంగీతా మాధవన్ నాయర్, అపర్ణ దాస్ నటించారు. మాలికాపురం రైటర్ అభిలాష్ పిళ్లై ఈ సినిమాకు కథ అందించాడు. ఆనంద్ శ్రీబాల అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ ఇది. అతనికి తన తల్లి శ్రీబాలతో మంచి అనుబంధం ఉంటుంది.
అతని గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రీబాలనే. ఆమె ఓ జర్నలిస్ట్. మంచి ఇన్వెస్టిగేటివ్ ప్రతిభ ఉన్న ఆనంద్ శ్రీబాల.. తన గర్ల్‌ఫ్రెండ్ తో కలిసి మెరిన్ జాయ్ అనే ఓ విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో కేసులో బాగా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఈ ఆనంద్ శ్రీబాల మూవీలో శ్రీబాలగా అటు సంగీతా మాధవన్, అపర్ణ దాస్ నటించారు.