Web Series Sequel: తెలుగు వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా సినిమా - ఆనంద్ దేవరకొండ ప్రయోగం - బేబీ హీరోయిన్‌తో రొమాన్స్!
Web Series Sequel: సూపర్ హిట్ తెలుగు వెబ్‌సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ సినిమాగా తెరకెక్కుతోండటం గమనార్హం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో బేబీ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.
Web Series Sequel: కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తెలుగు వెబ్‌సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకుల మన్ననలను అందుకున్నది. తెలుగులో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. 1990ల కాలం నాటి మధుర జ్ఞాపకాల్ని, అనుబంధాలు, అప్యాయతల్ని ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తూ కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్‌కు తాజాగా సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ సినిమాగా తెరకెక్కుతోండటం గమనార్హం.
రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్...
రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నైంటీస్ మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఆదిత్య పెద్దవాడైతే....
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ విడుదలచేశారు. నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్ లోని ఆదిత్య పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతడికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు.
మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా... ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి.... ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ.... మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ అనౌన్స్‌మెంట్ వీడియో చివర్లో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంటోంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలబోతతో బ్యూటీఫుల్‌గా ఈ మూవీ సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
లండన్‌లో షూటింగ్...
ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్ లండన్‌లో మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తోన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బేబీ తర్వాత...
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న మూవీ ఇది. 2023లో రిలీజైన బేబీ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆ ఏడాది టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. బేబీ సక్సెస్‌తో వైష్ణవి చైతన్య టాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. సిద్దు జొన్నలగడ్డ జాక్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది. గమ్ గమ్ గణేషా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఆనంద్ దేవరకొండ చేస్తోన్న మూవీ ఇది.