Gam Gam Ganesha OTT: స‌డెన్‌‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - గం గం గ‌ణేశా స్ట్రీమింగ్ ఎందులో అంటే?-anand deverakonda telugu crime comedy movie gam gam ganesha streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gam Gam Ganesha Ott: స‌డెన్‌‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - గం గం గ‌ణేశా స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Gam Gam Ganesha OTT: స‌డెన్‌‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - గం గం గ‌ణేశా స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Gam Gam Ganesha OTT: ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన క్రైమ్ కామెడీ మూవీ గం గం గ‌ణేశా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

గం గం గ‌ణేశా ఓటీటీ

Gam Gam Ganesha OTT: ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గం గం గ‌ణేశా మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా డైరెక్ట్‌గా గం గం గ‌ణేశా ఓటీటీలోకి వ‌చ్చి తెలుగు ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో గం గం గ‌ణేశా మూవీ త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఇద్ద‌రు హీరోయిన్లు...

గం గం గ‌ణేశా మూవీలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ‌, న‌య‌న్ సారిక హీరోయిన్లుగా న‌టించారు. జ‌బ‌ర్ధ‌స్థ్ ఇమ్మాన్యుయేల్‌, వెన్నెల‌కిషోర్‌, రాజ్ అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాతో ఉద‌య్ బొమ్మిశెట్టి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేదార్ శెల‌గంశెట్టి, వంశీ కారుమంచి గం గం గ‌ణేశా మూవీ ప్రొడ్యూస్ చేశారు.

ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే...

మే 31న థియేట‌ర్ల‌లో రిలీజైన గం గం గ‌ణేశా మూవీ ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. గ‌ణేష్‌గా ఆనంద్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌ర్‌తో పాటు క‌థ‌లోని కామెడీ, ట్విస్ట్‌లు బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఏడు కోట్ల వ‌జ్రం క‌థ‌...

గ‌ణేష్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేస్తూ బ‌తుకుతుంటాడు. శృతిని (న‌య‌న్ సారిక‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ గ‌ణేష్ ద‌గ్గ‌ర డ‌బ్బు లేద‌ని అత‌డి ప్రేమ‌కు బ్రేక‌ప్ చెబుతుంది శృతి. డ‌బ్బున్న మ‌రో యువ‌కుడితో పెళ్లికి సిద్ధ‌ప‌డుతుంది. ల‌వ్ బ్రేక‌ప్‌తో గ‌ణేష్ ఎలాగైనా పెద్ద మొత్తంలో డ‌బ్బు సంపాదించాల‌ని ఫిక్స‌వుతాడు.

ఏడు కోట్ల విలువైన ఓ వ‌జ్రాన్ని దొంగ‌త‌నం చేసే డీల్ కుదుర్చుకుంటాడు. గ‌ణేష్ దొంగ‌త‌నం చేసిన ఆ వ‌జ్రం అనుకోకుండా ఓ వినాయ‌కుడి విగ్ర‌హంలో ప‌డిపోతుంది. ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి (రాజ్ అర్జున్‌) త‌యారు చేయించిన ఆ విగ్ర‌హం అత‌డి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఊరిలోకి ఎలా వెళ్లింది?ఈ విగ్ర‌హం నుంచి వ‌జ్రాన్ని గ‌ణేష్ ఎలా కొట్టేశాడు? ఈ రాజ‌కీయ గొడ‌వ‌ల కార‌ణంగా గ‌ణేష్‌ జీవితం ఎలా చిక్కుల్లో ప‌డింది? అత‌డి లైఫ్‌లోకి వ‌చ్చిన నీల‌వేణి (ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ‌) ఎవ‌రు అన్న‌దే గం గం గ‌ణేశా మూవీ క‌థ‌.

ర‌ష్మిక మంద‌న్న ప్ర‌మోష‌న్స్‌...

గం గం గ‌ణేశా ప్ర‌మోష‌న్స్‌లో ర‌ష్మిక మంద‌న్న భాగం కావ‌డం, టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ కొత్త‌గా ఉండ‌టంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. థియేట‌ర్ల‌లో గం గం గ‌ణేశా మూవీ దాదాపు ఐదు కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. థియేట‌ర్ల‌లో వ‌సూళ్ల ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించిన ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ డీల్‌తో ప్రొడ్యూస‌ర్ల‌కు లాభాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం.

బేబీతో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌...

బేబీ మూవీతో కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ వంద కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బేబీలో ఎమోష‌న‌ల్‌లో రోల్‌లో క‌నిపించిన ఆనంద్ దేవ‌ర‌కొండ గం గం గ‌ణేశాలో అందుకు పూర్తి డిఫ‌రెంట్‌గా ఫ‌న్ క్యారెక్ట‌ర్‌లో త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. గం గం గ‌ణేశా త‌ర్వాత ఓ మూడు సినిమాల‌కు ఆనంద్ దేవ‌ర‌కొండ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య కాంబోలో ఓ మూవీ రాబోతోంది.