ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. విద్యా వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపే మూవీ.. ఇక్కడ చూసేయండి!-anaganaga ott streaming on etv win sumanth kajal rani anaganaga ott release today and movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. విద్యా వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపే మూవీ.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. విద్యా వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపే మూవీ.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ నేరుగా తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం అనగనగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హీరో సుమంత్ తండ్రిగా ప్రధాన పాత్ర పోషించిన అనగనగా ఓటీటీలోకి నేడు వచ్చేసింది. విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థుల ఒత్తిడిని ఎత్తి చూపే అనగనగా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్కడ ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. విద్యా వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపే మూవీ.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతి వారం సరికొత్త ఓటీటీ సినిమాలు ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తుంటాయి. అలా ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా ఇవాళ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

స్కూల్ నేపథ్యంలో సాగే

ఆ సినిమానే అనగనగా. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో హీరోగా చేసి అలరించిన సుమంత్ అనగనగా మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు. అలాగే, వ్యాస్ అనే టీచర్‌గా యాక్ట్ చేశాడు సుమంత్. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన అనగనగా సినిమా స్కూల్ నేపథ్యంలో సాగుతుంది.

తండ్రికొడుకుల మధ్య ఎమోషన్

విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే అనగనగా సినిమాలో విద్యార్థులపై ఒత్తిడి, పిల్లలకు ఎలా పాఠాలు చెబితే అర్థం అవుతుందనే అంశాలను చూపించారు. అలాగే, తండ్రికొడుకుల మధ్య ఉండే ఎమోషనల్, తల్లి ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేవి చక్కగా చిత్రీకరించారు. తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కింది.

ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్

ఇప్పటికే అనగనగా స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా బాగుందని, నటీనటుల యాక్టింగ్ అదిరిపోయిందని పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అలాంటి అనగనగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (మే 15) ఈటీవీ విన్‌లో అనగనగా ఓటీటీ రిలీజ్ అయింది.

హీరోయిన్‌గా కాజల్ రాణి

అనగనగా మూవీలో కాజల్ రాణి హీరోయిన్‌గా తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాతోనే కాజల్ రాణి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే, అనగనగా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ మరో కీలక పాత్ర పోషించాడు. కొడుకుగా, విద్యార్థిగా చక్కటి నటన కనబర్చాడు. క్లైమాక్స్‌లో దాదాపుగా ఏడిపించేసేలా విహార్ష్ యాక్టింగ్ ఉందని రివ్యూవర్స్ చెబుతున్నారు.

కుటుంబంతో కలిసి చూసేలా

ఇలాంటి చక్కటి తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం అనగనగాను ఈటీవీ విన్ ఓటీటీలో కుటుంబంతో కలిసి ఎంచక్కా చూసేయండి. ఇదిలా ఉంటే, ఇటీవల సుమంత్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమ చిగిరించిందని, వారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పుకార్లు తెగ జోరందుకున్నాయి.

పెళ్లి చేసుకోనంటూ

దీంతో ఆ రూమర్స్‌పై హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. తనకు మృణాల్ ఠాకూర్ మధ్య ఫ్రెండ్‌షిప్ తప్ప మరేం లేదని చెప్పుకొచ్చాడు. తాను జీవితంలో పెళ్లి చేసుకోనని, ఇలాగే బాగుందని హీరో సుమంత్ పుకార్లపై వివరణ ఇచ్చుకున్నాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం