ఓటీటీ అంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, సిరీస్ లకు పెట్టింది పేరు. విభిన్నమైన సినిమాలు ఓటీటీని ఏలుతున్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, తండ్రీకొడుకుల మధ్య అనుబంధంతో వచ్చిన అనగనగా సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఈటీవీ విన్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఈ ఓటీటీలో టాప్-5 మూవీస్ లో రెండు కామెడీ సినిమాలున్నాయి. ఆ సినిమాలు ఏంటో చూసేయండి.
మే 15న నేరుగా ఓటీటీ లోకి రిలీజైన ఈ మూవీలో విద్యావ్యవస్థలోని లోపాలు, మార్కులు.. ర్యాంకులతో చిన్నారుల ఒత్తిడిలోకి నెట్టే విధానాన్ని చక్కగా చూపించారు. ప్రతి వ్యక్తిని కదిలించే కథ కాబట్టే ఈ మూవీ ఈటీవీ విన్ లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఓటీటీలో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
కోర్టు రూమ్ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది ‘ఉద్వేగం: ది ఫస్ట్ కేస్’. కాంట్రవర్షియల్ స్ఫూర్తి కేసు ఎలాంటి మలుపు తిరిగింది, కోర్టులో ఎలాంటి డ్రామా చోటు చేసుకుందనే విషయాలను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్ ట్రెండింగ్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది.
ఊర్లో ఉన్న ఒకే అక్క అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు గ్రామంలోని యువకులు ప్రయత్నించడం.. మధ్యలో హీరో ఎంట్రీ.. ఇలాంటి స్టోరీ లైన్ తో కడుపుబ్బా నవ్వించే సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. హీరోగా మారిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన ఈ మూవీ మే 8 నుంచి ఈటీవీ విన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రదీప్ సరసన మరో యాంకర్ దీపిక పిల్లి ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈటీవీ విన్ ట్రెండింగ్ లో మూడో ప్లేస్ లో ఉందీ సినిమా.
ఈటీవీ విన్ లోకి వచ్చిన అయిదు నెలల తర్వాత కూడా ‘రహస్యం ఇదం జగత్’ అదరగొడుతోంది. ఈ ఓటీటీ ఒరిజినల్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఉత్కంఠ రేపే థ్రిల్ తో సాగుతోంది. అభిరాం, అకీరా దంపతులు అమెరికాలో ఉంటారు. ఇండియాలో ఉండే అకీరా తండ్రి చనిపోతారు. ఒంటరిగా ఉండే తల్లి కోసం భారత్ కు బయలుదేరిన అకీరాతో పాటు అభిరాం కూడా వస్తాడు. ఈ ప్రయాణంలో రాత్రి పూట నెలకొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ సాగుతుంది.
నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే మూవీ కమిటీ కుర్రోళ్లు. గతేడాది థియేటర్లలో ఈ సినిమా సత్తాచాటింది. 2024 సెప్టెంబర్ 12న ఓటీటీలోకి వచ్చిన మూవీ ఈటీవీ విన్ లోనూ అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ ఫైవ్ లో ఉందీ సినిమా. 12 ఏళ్లకు ఓ సారి జరిగే జాతర కోసం ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ ఊరికి రావడం.. అక్కడ ఉన్న చిన్ననాటి స్నేహితులతో సరదాలు, సంతోషాలు, గొడవలు.. ఇలా కామెడీ ఎమోషనల్ రైడ్ గా సాగుతోంది ఈ సినిమా.
సంబంధిత కథనం